senior womens cricket
-
టాపార్డరే కీలకం: మిథాలీ
న్యూఢిల్లీ: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే సీనియర్ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత అవకాశాలు టాపార్డర్ రాణించడంపైనే ఆధారపడి ఉంటాయని దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘భారత టాపార్డరే కీలకం. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ఆమె మ్యాచ్ విన్నర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా బాగా ఆడుతోంది. ఇటీవలే సఫారీలో అండర్–19 మెగా ఈవెంట్ గెలుచుకొచ్చిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌ల అనుభవం కూడా భారత సీనియర్ జట్టుకు ఉపకరిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లను ఓడిస్తే మిగతా జట్లపై విజయం సులువవుతుంది. బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవాలంటే బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిందే’ అని మిథాలీ విశ్లేషించింది. -
5 ఫోర్లు, 5 సిక్స్‌లతో విధ్వంసం.. ఎవరీ కిరణ్ నవ్‌గిరే..?
మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే చేలరేగింది. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే నవ్‌గిరే అర్ధసెంచరీ సాధించింది. తద్వారా మహిళల టి20 చాలెంజ్ టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్దసెంచరీ సాధించిన బ్యాటర్‌గా నవ్‌గిరే నిలిచింది. అంతకు ముందు షఫాలీ వర్మ 30 బంతుల్లో అర్దసెంచరీ సాధించి ఈ రికార్డును కలిగి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న కిరణ్ 69 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. కాగా కిరణ్ ఒంటరి పోరాటం చేసినప్పటికి వెలాసిటీకి ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన కిరణ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎవరీ కిరణ్ నవ్‌గిరే 27 ఏళ్ల కిరణ్ నవ్‌గిరే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించింది. ఆమె తన క్రీడా జీవితాన్ని అథ్లెట్‌గా ప్రారంభించింది. జావెలిన్ త్రో, షాట్‌పుట్,రిలే రన్నింగ్‌లో చాలా పతకాలు కిరణ్ సాధించింది. అయితే భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనిని ఆదర్శంగా తీసుకుని 2016లో అథ్లెటిక్స్ను వదిలి నవ్‌గిరే క్రికెట్లోకి అడుగుపెట్టింది. ధోని ప్రశాంతత, హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ ఆమెను ఎంతో గానే ప్రేరేపించాయి. క్రికెట్ కెరీర్ మహారాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడంతో డొమాస్టిక్ క్రికెట్లో నాగాలాండ్ జట్టుకు కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇటీవల ముగిసిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో కిరణ్ సంచలనం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోను కిరణ్ 76 బంతుల్లో 162 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్లో 76 బంతుల్లో 162 పరుగులు చేసింది తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. ఇక టోర్నీలో నవ్‌గిరే 525 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: Dinesh Karthik: దినేశ్ కార్తిక్ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్! -
ఎదురులేని రైల్వేస్ జట్టు
రాజ్‌కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్‌తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది. -
అనంతపురంపై కడప విజయం
కడప స్పోర్ట్స్ : అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీలు కడప నగరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో అనంతపురం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 45.3 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని శ్రీలక్ష్మి 88 పరుగులు చేసింది. జట్టులోని రోజా 20, నాగమణి 18 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లు హర్షవర్ధిణి 3, అనూష 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 35.3 ఓవర్లలోనే 136 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని పల్లవి 68 పరుగులు, అనూష 21 పరుగులు చేసింది. కడప బౌలర్లు లక్ష్మి 3, ఓబులమ్మ 4 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 62 పరుగులు తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు పొందింది. నెల్లూరుపై కర్నూలు ఘన విజయం నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నెల్లూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులోని ఎన్.అనూష 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో 126 బంతుల్లో 128 పరుగులు చేసింది. ఈమెకు జతగా నిలిచిన వి. అనూషారాణి 18 ఫోర్లతో 138 బంతుల్లో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. జి. చంద్రలేఖ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నెల్లూరు బౌలర్ యామిని 1 వికెట్ తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని సింధూజ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. కర్నూలు బౌలర్లు అంజలి 2, చంద్రలేఖ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 232 పరుగుల భారీ విజయం కైవసం చేసుకుంది. దీంతో కర్నూలు జట్టుకు 4 పాయింట్లు లభించాయి.