టీటీలో ప్రతిభ చాటిన కాజల్‌ | kajal wins in tt | Sakshi
Sakshi News home page

టీటీలో ప్రతిభ చాటిన కాజల్‌

Published Sun, Sep 4 2016 10:55 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

టీటీలో ప్రతిభ చాటిన కాజల్‌ - Sakshi

టీటీలో ప్రతిభ చాటిన కాజల్‌

విజయవాడ స్పోర్ట్స్‌ : 
రాజమహేంద్రవరంలో ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకూ జరిగిన ఏపీ స్టేట్‌ 2వ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ఐజీఎంసీ స్టేడియం క్రీడాకారిణి ఆర్‌.కాజల్‌ సునార్‌ నాలుగు ఏజ్‌ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో 3–1 తేడాతో నగరానికే చెందిన ఎస్‌.మహితపై, జూనియర్‌ బాలికల విభాగంలో 3–1 తేడాతో శైలూ నూర్‌బాషాపై, యూత్‌ బాలికల విభాగంలో 3–0 తేడాతో నాగశ్రావణిపై, ఉమెన్‌ విభాగంలో 3–1 తేడాతో  నాగశ్రావణి(అనంతపురం)పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఎస్‌కే ముజ్జామిల్‌ అహ్మద్‌.. యూత్‌ బాలుర విభాగంలో సెమీస్‌ వరకూ చేరుకుని తృతీయ స్థానాన్ని సాధించాడు. వీరిద్దరూ ఐజీఎంసీ స్టేడియంలోని కోచ్‌లు శ్రీనివాస్, గౌసియా ప్యారీ వద్ద శిక్షణ పొందుతున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్, ఉపాధ్యక్షుడు పి.విశ్వనాథ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవీఎస్‌ ప్రకాష్, కె.బలరామ్, శాప్‌ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, డీఎస్‌డీవో సిరాజుద్దీన్‌ అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement