నెల్లూరులో వాకాటి గెలుపు | vakati narayana reddy win in nellore mlc elections | Sakshi
Sakshi News home page

నెల్లూరులో వాకాటి గెలుపు

Published Mon, Mar 20 2017 10:05 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

vakati narayana reddy win in nellore mlc elections

నెల్లూరు : నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలుపొందారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్‌ కుమార్‌పై 87 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం 851 ఓట్లు పోలవగా... టీడీపీ అభ్యర్ధికి 462, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధికి 378 ఓట్లు వచ్చాయి.  ఇందులో రెండు ఓట్లు చెల్లనివి కాగా...మరో 10 ఓట్లు తేలలేదు.

కాగా జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి ఆధిక్యం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. అధికారంతో పాటు ప్రలోభాల పర్వానికి తెర తీసి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మంత్రి నారాయణ అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరై... వాకటి గెలుపుకు దగ్గర ఉండి చక్రం తిప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement