కాంగ్రెస్ జాబితా ఖరారు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. జిల్లాలోని యర్రగొండపాలెం మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒంగోలు, బాపట్ల, నెల్లూరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని దర్శి పవన్‌కుమార్‌కు, బాపట్లను పనబాక లక్ష్మికి, నెల్లూరును వాకాటి నారాయణరెడ్డికి కేటాయించారు.
అసెంబ్లీ అభ్యర్థులు వీరే...
ఒంగోలుకు ఎద్దు శశికాంత్‌భూషణ్, సంతనూతలపాడుకు నూతలపాటి తిరుమలరావు, కొండపికి గుర్రాల రాజ్‌విమల్, కందుకూరుకు రాచగొర్ల వెంకట్రావు యాదవ్, కనిగిరికి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురానికి ఏలూరి రామచంద్రారెడ్డి, గిద్దలూరుకు కందుల గౌతంరెడ్డి, దర్శికి కే జ్వాలారావు, అద్దంకికి గాలం లక్ష్మీయాదవ్, పర్చూరుకు మోదుగుల కృష్ణారెడ్డి, చీరాలకు మెండు నిషాంత్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు.