సన్‌రైజర్స్‌ బోణి | Sunrisers hyderabad wins aganist RCB in hyderabad | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ బోణి

Published Wed, Apr 5 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

సన్‌రైజర్స్‌ బోణి

సన్‌రైజర్స్‌ బోణి

ఐపీఎల్‌-10 సీజన్‌ను ఆతిధ్య సన్‌రైజర్స్‌ జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బ్యాట్సమన్లలో యువరాజ్‌ సింగ్‌ 62(27) బంతుల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 209 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు.
 
52 పరుగుల వద్ద మణిదీప్‌ సింగ్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన క్రీస్‌ గేల్‌(32) భారీ షాట్‌కు యత్నించి డేవిడ్‌ వార్నర్‌కు బౌండరీ వద్ద దొరికిపోయాడు. ఆ తర్వాత ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కొన్ని బంతులు మిగిలి ఉండగానే 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో నెహ్ర, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement