గెలుపోటములు సహజం..
గెలుపు, ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలని నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు అన్నారు. భీమవరం కాస్మో పాలిటన్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాలుగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ టే బుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
–డీఎస్పీ పూర్ణ చంద్రరావు
–ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
భీమవరం :
గెలుపు, ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలని నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు అన్నారు. భీమవరం కాస్మో పాలిటన్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన నాలుగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ టే బుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నేటితరం విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన క్లబ్ అధ్యక్షుడు గోకరాజు రామరాజు మాట్లాడుతూ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగాయని అన్నారు. అనంతరం పోటీల్లో మెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో గుంటూరుకు చెందిన ఎ.గౌతమ్ కష్ణ, ఉమెన్ సింగిల్స్ ఫైనల్స్‌లో విజయవాడకు చెందిన ఆర్.కాజోల్, యూత్‌బాయ్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో గుంటూరుకు చెందిన ఎ.జగదీష్ కష్ణ, యూత్ గర్‌్ల్స సింగిల్స్ ఫైనల్స్‌లో విజయవాడకు చెందిన శైలు నూర్ బాషా, జూనియర్ బాయ్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో విశాఖపట్నంకు చెందిన పి.జయసూర్య, జూనియర్ సింగిల్స్ ఫైనల్స్‌లో విజయవాడకు చెందిన శైలు నూర్ బాషా, సబ్ జూనియర్స్ బాయ్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో కాకినాడకు చెందిన పి.సూర్యతేజ, సబ్ జూనియర్స్ గర్‌్ల్స సింగిల్స్ ఫైనల్స్‌లో విజయవాడకు చెందిన ఆర్.కాజోల్ విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌ఎన్ సుల్తాన్, ఉపాధ్యక్షుడు పి.విశ్వనాథరావు, కేవీ రాఘవరావు, భీమవరం క్లబ్ కార్యదర్శి పి.కష్ణబాబు పాల్గొన్నారు.