రెండో వన్డేలో భారత మహిళల ఓటమి  | indian Womens defeat in second ODI | Sakshi
Sakshi News home page

రెండో వన్డేలో భారత మహిళల ఓటమి 

Published Tue, Apr 10 2018 1:14 AM | Last Updated on Tue, Apr 10 2018 1:14 AM

indian Womens defeat in second ODI - Sakshi

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో చతికిలబడింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ బృందం 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.  తొలుత  భారత్‌ 37.2 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (42; 3 ఫోర్లు, 1 సిక్స్‌), దీప్తి శర్మ (26 నాటౌట్‌; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (4), హర్మన్‌ప్రీత్‌ (3) సహా మిగతావారు నిరాశ పరిచారు.

ప్రత్యర్థి బౌలర్లలో హజెల్, ఎకల్‌స్టన్‌ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్‌ 29 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగులు చేసి గెలుపొందింది. వ్యాట్‌ (47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూమౌంట్‌ (39 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే గురువారం జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement