ముంబై: గెలవాల్సిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. సిరీస్ పరాజయంతో ఈ ఏడాదిని ముగించింది. 259 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 47 ఓవర్లలో 237/6 వద్ద పటిష్టంగానే కనిపించింది. 18 బంతుల్లో 22 పరుగుల విజయ సమీకరణం భారత మహిళలకే అనుకూలంగా ఉంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూజ (8), హర్లీన్ (1) అవుట్ కావడంతో ఓటమి ఖాయమైంది. 6 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయింది. తుదకు ఆసీస్ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గాయం పంటిబిగువన భరించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (117 బంతుల్లో 96; 13 ఫోర్లు)... జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు) అండతో అది్వతీయ పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే జనవరి 2న జరుగుతుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్‌ఫిల్డ్ (98 బంతుల్లో 63; 6 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఎలీస్ పెరీ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన వారిలో తాలియా (24; 2 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (23; 1 ఫోర్), జార్జియా (22; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. అయితే టెయిలెండర్ అలానా కింగ్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్స్‌లు) కొట్టిన భారీ సిక్సర్లతో ఆసీస్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ (5/38) వరుస విరామాల్లో వికెట్లను పడగొట్టింది. తర్వాత భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులకే పరిమితమైంది. అనాబెల్ సదర్లాండ్ (3/47) కీలక సమయంలో విలువైన వికెట్లను తీసి భారత్ గెలుపు రాతను మార్చింది. ఫీల్డింగ్‌లో గాయపడిన స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్ కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగింది. బెత్ మూనీ కొట్టిన షాట్‌ను బంతిని అందుకునే క్రమంలో చెరోవైపు నుంచి వచ్చిన స్నేహ్ రాణా, పూజ ఇద్దరి తలలు పరస్పరం ఢీకొని విలవిలలాడారు. తలనొప్పితో స్నేహ్‌రాణా మైదానం వీడింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: లిచ్‌ఫిల్డ్ (సి) రిచా (బి) శ్రేయాంక 63; అలీసా హీలీ (బి) పూజ 13; ఎలీస్ పెరీ (సి) శ్రేయాంక (బి) దీప్తి శర్మ 50; బెత్ మూనీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి శర్మ 10; తాలియా (బి) దీప్తి శర్మ 24; గార్డ్‌నెర్ (సి) అమన్‌జీత్ (బి) స్నేహ్ రాణా 2; అనాబెల్ (సి అండ్ బి) దీప్తి 23; జార్జియా (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 22; అలానా కింగ్ (నాటౌట్) 28; కిమ్ గార్త్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–40, 2–117, 3–133, 4–160, 5–170, 6–180, 7–216, 8–219. బౌలింగ్: రేణుక 7–0–36–0, పూజ 10–0–59–1, అమన్‌జోత్ 3–0–21–0, శ్రేయాంక 10–0–43–1, స్నేహ్ రాణా 10–0–59–1, దీప్తి శర్మ 10–0–38–5.
భారత్ ఇన్నింగ్స్: యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 14; స్మృతి (సి) తాలియా (బి) అలానా 34; రిచా ఘోష్ (సి) లిచ్‌ఫిల్డ్ (బి) అనాబెల్ 96; జెమీమా (సి) లిచ్‌ఫిల్డ్ (బి) వేర్‌హమ్ 44; హర్మన్‌ప్రీత్ (సి) హీలీ (బి) వేర్‌హమ్ 5; దీప్తి శర్మ (నాటౌట్) 24; అమన్‌జోత్ (బి) అనాబెల్ 4; పూజ (సి) గార్డ్‌నెర్ (బి) అనాబెల్ 8; హర్లీన్ (బి) గార్డ్‌నెర్ 1; శ్రేయాంక (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–37, 2–71, 3–159, 4–171, 5–218, 6–224, 7–240, 8–243. బౌలింగ్: గార్డ్‌నెర్ 10–0–46–1, బ్రౌన్ 7–0–37–0, కిమ్ గార్త్ 6–0–24–1, అనాబెల్ సదర్లాండ్ 9–0–47–3, అలానా కింగ్ 7–0–43–1, తాలియా 4–0–15–0, జార్జియా వేర్‌హమ్ 7–0–39–2.
Comments
Please login to add a commentAdd a comment