
హుబ్లీ: బంగ్లాదేశ్ మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత ‘ఎ’ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఎన్.ఎమ్ చౌదరి (56; 9 ఫోర్లు), వనిత (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... ఆరేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన నేహా తన్వర్ (44; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకుంది. రెండు జట్ల మధ్య మూడో వన్డే గురువారం ఇదే స్టేడియంలో జరగనుంది.