ఢిల్లీ వన్డే: రైనా అవుట్ | Suresh Raina to miss second ODI vs New Zealand, yet to recover from viral | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వన్డే: రైనా అవుట్

Published Tue, Oct 18 2016 7:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఢిల్లీ వన్డే: రైనా అవుట్

ఢిల్లీ వన్డే: రైనా అవుట్

ఢిల్లీ: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా.. న్యూజిలాండ్తో రెండో వన్డేకూ దూరంకానున్నాడు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న రైనా ఇంకా కోలుకోలేదు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. దీంతో ఈ నెల 20న ఢిల్లీలో జరిగే వన్డేకు రైనా అందుబాటులో ఉండటం లేదు.

న్యూజిలాండ్తో ధర్మశాలలో ఆదివారం జరిగిన తొలి వన్డేకు కూడా రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించింది. కాగా అతని స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement