ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకుని కెరీర్‌లో మూడో వన్డే శతకాన్ని సాధించి ఔట్ కాగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీ నమోదు చేశాడు.
ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), రాహుల్ (9) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు.
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment