
దక్షిణాఫ్రికా భారీ విజయం
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 142 పరుగుల భారీ తేడాతో
జొహన్నెస్‌బర్గ్: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 142 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (93 బంతుల్లో 111; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... డుమిని (58 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసో (81 బంతుల్లో 75; 10 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. హెడ్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (56 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌పై పరుగులపరంగా సఫారీలకు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం.