స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన | England win in second ODI | Sakshi
Sakshi News home page

స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

Published Thu, Mar 1 2018 1:18 AM | Last Updated on Thu, Mar 1 2018 1:18 AM

England win in second ODI - Sakshi

బెన్‌ స్టోక్స్‌

మౌంట్‌ మాంగనీ: ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అదరగొట్టడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ సునాయస విజయం సాధించింది. తొలి వన్డేలో ఓడిన ఇంగ్లండ్‌ బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1–1తో సమంచేసింది. స్టోక్స్‌ (63 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌)తో పాటు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), బెయిర్‌స్టో (37; 5 ఫోర్లు, 1 సిక్స్‌), బట్లర్‌ (36 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగడంతో 37.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి గెలుపొందింది.

అంతకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్‌ (50; 7 ఫోర్లు), సాన్‌ట్నర్‌ (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో స్టోక్స్, వోక్స్, మొయిన్‌ అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించడంతో పాటు రెండు రనౌట్లలో పాలుపంచుకున్న స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్లు మధ్య మూడో వన్డే శనివారం వెల్లింగ్టన్‌లో జరుగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement