కారులో దాక్కుని 16 కిలోమీటర్లు...
కారులో దాక్కుని 16 కిలోమీటర్లు...
Published Fri, Sep 19 2014 1:37 PM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
సాక్షి, అడిలైడ్: హైవేలో కారులో రయ్‌మని ఒంటరిగా దూసుకుపోతున్న వ్యక్తికి ఉన్నట్లుండి ఏడుపులు వినిపిస్తే ఎలా ఉంటుంది? గుండె ఆగిపోదు. కానీ, జేన్ బ్రిస్టర్ మాత్రం ధైర్యం చేయటంతో.. ఓ జీవి ప్రాణం నిలిచింది.
గత వారం జేన్ తన కారును అడిలైడ్‌లో పార్కింగ్ చేయగా, ఎక్కడి నుంచి వచ్చింది తెలీదుగానీ ఓ కోలా(ఒక రకం ఎలుగుబంటి) టైర్ల గుండా కారు ముందు భాగంలోకి యాక్సల్ ప్రాంతంలో దాక్కుంది. అది గమనించని జేన్ కారును బయటికి తీసి తన గమ్యస్థానానికి బయలుదేరాడు. అలా ఓ పది మైళ్ల(16 కిలోమీటర్లు) దూరం వెళ్లాక అతనికి ఏవో ఏడుపులు వినిపించాయి. చివరకు జుట్టు కాలిన వాసన రావటంతో అనుమానం వచ్చి కారు మొత్తం వెతికి చూశాడు. తీరా చూస్తే కారు ముందు భాగం ఓపెన్ చూస్తే అది బిక్కు బిక్కు మంటూ ఓ మూల నక్కింది.
వెంటనే జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా, వారొచ్చి దానిని రక్షించారు. సాధారణంగా కొలాలు చాలా సున్నితమైన జీవులను, అంతా దూరం ప్రయాణించినా వేడికి ఆ ఆడ కోలా అది బతికి ఉండటం ఆశ్చర్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement