ఆసీస్‌లో ఫుల్ ‘ప్రాక్టీస్’
ఆకట్టుకున్న భారత బ్యాట్స్‌మెన్
సీఏ ఎలెవన్‌తో మ్యాచ్ డ్రా
అడిలైడ్: కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ గడ్డపై భారత్‌కు ఫుల్ ‘ప్రాక్టీస్’ లభించింది. రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లు తడాఖా చూపితే... రెండో రోజు బ్యాట్స్‌మెన్ నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు నమోదు చేయడంతో సీఏ ఎలెవన్‌తో శుక్రవారం ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా అయ్యింది. గ్లైడరల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది.
దీంతో టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం దక్కింది. కోహ్లి (94 బంతుల్లో 66 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు), విజయ్ (136 బంతుల్లో 60 రిటైర్డ్; 10 ఫోర్లు), రహానే (64 బంతుల్లో 56 రిటైర్డ్; 7 ఫోర్లు), సాహా (67 బంతుల్లో 51 రిటైర్డ్; 8 ఫోర్లు)లు రాణించారు. రోహిత్ శర్మ (48) ఫర్వాలేదనిపించాడు. తర్వాత సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 5 వికెట్లకు 83 పరుగులు చేసింది. సిల్క్ (41 నాటౌట్), షార్ట్ (26) ఓ మోస్తరుగా ఆడినా... మిగతా వారు విఫలమయ్యారు. ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 243 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ రిటైర్డ్ అవుట్ 60; ధావన్ (సి) ప్యాటిసన్ (బి) లాలర్ 0; పుజారా (సి) టర్నర్ (బి) లాలర్ 22; కోహ్లి రిటైర్డ్ అవుట్ 66; రహానే రిటైర్డ్ అవుట్ 56; రోహిత్ రనౌట్ 48; సాహా (సి) టర్నర్ (బి) మూడీ 51; రైనా (సి) సిల్క్ (బి) టర్నర్ 20; జడేజా (సి) కార్టర్స్ (బి) లాలర్ 23; కరణ్ (సి) టర్నర్ (బి) లాలర్ 4; ఉమేశ్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: (90 ఓవర్లలో ఆలౌట్) 375. వికెట్ల పతనం: 1-1; 2-36; 3-159; 4-169; 5-262; 6-272; 7-311; 8-351; 9-355; 10-375.
బౌలింగ్: బర్డ్ 22-4-81-0; లాలర్ 17-4-59-4; గుల్బిస్ 17-3-48-0; మూడీ 13-1-56-1; షార్ట్ 8-0-47-0; ప్యాటిసన్ 7-1-32-0; టర్నర్ 6-1-40-1
సీఏ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 21 ఓవర్లలో 83/5.