బ్రిస్బేన్: తొలి టెస్టులో స్పిన్‌కు అనుకూలించిన అడిలైడ్‌కంటే రెండో టెస్టు వేదిక బ్రిస్బేన్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి వూలెన్ గాబా స్టేడియం వికెట్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని క్యురేటర్ కెవిన్ మిషెల్ వెల్లడించారు. ‘కాస్త పచ్చిక ఎక్కువగా ఉంటూ జీవం ఉన్న వికెట్ ఇది.
గతంలోని సంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మంచి బౌన్స్, పేస్ ఈ పిచ్‌పై ఉన్నాయి. అదే తరహాలో దీనిని సిద్ధం చేస్తున్నాం. ఇది ఆస్ట్రేలియా పేసర్లకు సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ మైదానంలో బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. గత ఏడాది ఇక్కడ ఇంగ్లండ్‌పై జాన్సన్ 9 వికెట్లు తీశాడు.
టాప్-20లోకి కోహ్లి
దుబాయ్: అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు 26వ ర్యాంక్‌లో ఉన్న విరాట్.. ఏకంగా పది స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్‌కు చేరాడు. పుజారా 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.
‘గాబా’లో పేస్ వికెట్!
Published Mon, Dec 15 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement