అడిలైడ్: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఐదవ రోజు భారత్ రెండో ఇన్నింగ్స్లో 19.2 ఓవర్లలో 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్గా ధావన్ 4.1 ఓవర్లలో( 8 బంతుల్లో 1ఫోరు) 9 పరుగులతో ఆదిలోనే చేతులెత్తేశాడు. దాంతో ధావన్ సింగల్ డిజిట్కే పరిమతమైయ్యాడు.
పుజారా 38 బంతుల్లో (4 ఫోర్లు; 21 పరుగులు) లెయిన్ బౌలింగ్లో హుదిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం మురళీ విజయ్ ( 73 బంతుల్లో 2 ఫోర్లు; 1 సిక్స్) 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పూజారా తరువాత బరిలోకి దిగిన భారత్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 2 ఫోర్లు బాది19 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్లు జాన్సన్, లెయిన్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం 23. 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 78 పరుగులతో కొనసాగుతోంది.
రెండో వికెట్ కోల్పోయిన భారత్; స్కోరు 78/2
Published Sat, Dec 13 2014 6:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement
Advertisement