51 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి | Virat Kohli Breaks Record Most Runs As Captain Against Australia | Sakshi
Sakshi News home page

ఆ రికార్డుకు 51 ఏళ్లు పట్టింది

Published Fri, Dec 18 2020 11:01 AM | Last Updated on Fri, Dec 18 2020 11:32 AM

Virat Kohli Breaks Record Most Runs As Captain Against Australia - Sakshi

అడిలైడ్‌ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ‌రొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ టెస్టులో కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో కోహ్లి ఆస్ట్రేలియాపై అత్య‌ధిక టెస్టు ప‌రుగులు చేసిన భార‌త కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు బ్రేక్‌ చేయడానికి 51 సంవ‌త్స‌రాలు పట్టింది. ఇంతకముందు ఆసీస్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మాజీ ఆటగాడు ఎంఏకే ప‌టౌడీ పేరిట ఉంది.(చదవండి : 'కోహ్లి రనౌట్‌.. మాకు పెద్ద అవమానం')

ఆసీస్‌తో భారత్‌ ఆడిన 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ప‌టౌడీ 829 ప‌రుగులు చేశాడు. తాజాగా కోహ్లి మాత్రం 10 టెస్టుల‌కు నాయ‌క‌త్వం వ‌హించి 851 ప‌రుగులు చేసి ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహానేతో సమన్వయలోపం వల్ల కోహ్లి రనౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక అడిలైడ్ టెస్టులో ఆరంభం నుంచి నిధానంగా ఆడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. (చదవండి : వైరల్‌ : గొడవపడిన కోహ్లి, రోహిత్‌ ఫ్యాన్స్)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement