MAK Pataudi
-
51 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్ టెస్టులో కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లి ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు బ్రేక్ చేయడానికి 51 సంవత్సరాలు పట్టింది. ఇంతకముందు ఆసీస్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మాజీ ఆటగాడు ఎంఏకే పటౌడీ పేరిట ఉంది.(చదవండి : 'కోహ్లి రనౌట్.. మాకు పెద్ద అవమానం') ఆసీస్‌తో భారత్ ఆడిన 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన పటౌడీ 829 పరుగులు చేశాడు. తాజాగా కోహ్లి మాత్రం 10 టెస్టులకు నాయకత్వం వహించి 851 పరుగులు చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహానేతో సమన్వయలోపం వల్ల కోహ్లి రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక అడిలైడ్ టెస్టులో ఆరంభం నుంచి నిధానంగా ఆడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. (చదవండి : వైరల్ : గొడవపడిన కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్) -
‘స్మార్ట్' గా సన్నద్ధం కావాలి!
కోల్‌కతా: సొంతగడ్డపై భారత్ సాధించిన విజయాల విలువను తక్కువ చేయరాదని, అయితే విదేశాల్లో గెలుపు అమితమైన సంతృప్తినిస్తుందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డాడు. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అతను ఎంఏకే పటౌడీ స్మారకోపన్యాసం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మణ్... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలాంటి సిరీస్‌లకు ముందు ప్రత్యేక తరహాలో సన్నద్ధం కావాలని సూచించాడు. ‘వాస్తవానికి ఈ సీజన్లో ఉత్తరాదిన పరిస్థితులు విదేశీ పిచ్‌లకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి. కానీ మన పర్యటన బిజీలో భారత ఆటగాళ్లెవరూ దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయాలు ఆలోచించి తెలివిగా సన్నద్ధం కావాలి.’ అని లక్ష్మణ్ అన్నాడు. టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాలనే కోణంలో డే అండ్ నైట్ టెస్టులలాంటి ప్రయోగం చేయడం తప్పేమీ కాదని అతను మద్దతు పలికాడు. చకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్లపై తనకు సానుభూతి ఉందన్న వీవీఎస్, ప్రాథమిక స్థాయిలోనే కోచ్‌లు యాక్షన్‌ను సరిదిద్దాలని సూచించాడు. -
పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఈడెన్ గార్డెన్స్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఆ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా వక్తగా తన ప్రావీణ్యాన్ని చూపనున్నాడు. ఈనెల 19న ఈడెన్‌లో జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్ ప్రసంగించనున్నాడు. భారత్, విండీస్ జట్ల మధ్య జరిగే చివరిదైన ఐదో వన్డేతోపాటు బెంగాల్ క్రికెట్ సంఘం 150 ఏళ్ల పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ‘పటౌడీ పరిజ్ఞానంపై నేనెప్పుడూ ఆకర్షితుడినయ్యే వాడిని. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎం.ఎల్. జైసింహా ద్వారా ఆయన గురించి తెలుసుకునేవాడిని. నాలాగే పటౌడీ కూడా హైదరాబాద్‌కు ఆడారు. ఆయన స్మారకోపన్యాసంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను’ అని లక్ష్మణ్ తెలిపాడు. అలాగే ప్రారంభ ఉపన్యాసంలో గవాస్కర్.. చివరి ఎడిషన్‌లో కుంబ్లే మాట్లాడతారు.