
హ్యూస్ 'హోం గ్రౌండ్'లో తొలిటెస్టు?
సిడ్నీ: భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలిటెస్టు వేదికను మార్చే యోచనలో ఉన్నారు. దివంగత క్రికెటర్ ఫిలిప్స్ హ్యూస్ కు నివాళిగా తొలి టెస్టును అడిలైడ్ లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సన్నద్దమైనట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 వ తేదీ నుంచి తొలి టెస్టు బ్రిస్బేన్ లో నూ, రెండో టెస్టు డిసెంబర్ 12వ తేదీ నుంచి అడిలైడ్ లో ఆరంభం కావాలి. అయితే తొలి టెస్టు ను హ్యూస్ సొంత గ్రౌండ్ అడిలైడ్ కు మారిస్తే ఎలా ఉంటుంది అనే యోచనలో సీఏ ఉంది. తొలి టెస్టు రద్దయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా.. అందుకు బదులుగా తొలిటెస్టును అడిలైడ్ ఏర్పాటు చేస్తేనే హ్యూస్ కు సరైన నివాళిగా ఉంటుందని క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు.
బౌన్సర్‌కు తీవ్రంగా గాయపడి మృతి చెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అంత్యక్రియలు బుధవారం (డిసెంబర్ 3న) జరగనున్నాయి. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన హ్యూస్ గురువారం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.