
విజయవాడ పోలీసు కమిషనరేట్ అప్‌గ్రేడ్
విజయవాడ నగరం పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: విజయవాడ నగరం పోలీసు కమిషనరేట్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ కమిషనరేట్‌కు కమిషనర్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియమించేవారు. తాజా మార్పుచేర్పులతో అదనపు డీజీ స్థాయికి పెంచి, ప్రస్తుతం ప్రత్యేక భద్రతా బలగం (ఎస్పీఎఫ్) డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. దీంతో సహా మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.