మున్సిపల్ పండిట్లను అప్‌గ్రేడ్ చేయాలి
Published Wed, Aug 3 2016 10:38 PM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
మచిలీపట్నం :
ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లే పురపాలక సంఘ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో తొలివిడతగా పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించటం అభినందనీయమన్నారు. ఇదే విధానాన్ని పురపాలక సంఘ పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. సక్సెస్ పాఠశాలల్లో పురపాలక సంఘ పాఠశాలలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. రాష్టోపాధ్యాయ సంఘం మచిలీపట్నంశాఖ అధ్యక్షుడు యువీ రాధాకృష్ణమూర్తి జీవో నెంబరు 144ను పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఒక ప్రకటనలో కోరారు.
Advertisement
Advertisement