తండాల అప్‌గ్రేడ్‌కు ప్రణాళికలు
Published Mon, Sep 12 2016 12:20 AM | Last Updated on Thu, Sep 19 2019 8:59 PM
గుండ్రాతిమడుగు (కురవి) : తండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు (విలేజీ) శివారు పెద్ద తండాలో ఆదివారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 5046 తండాలుండగా.. మొదటి దశలో 1756 తండాలు పంచాయతీలు కానున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించనుందని తెలిపారు. తీజ్ ఉత్సవాలను రాష్ట్రంలో ఒకేసారి నిర్వహించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మె ల్యే సత్యవతిరాథోడ్, నాయకులు బండి వెంకటరెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నున్నా రమణ, గుగులోత్ కిషన్‌నాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement