gp
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
తండాల అప్‌గ్రేడ్‌కు ప్రణాళికలు
గుండ్రాతిమడుగు (కురవి) : తండాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు (విలేజీ) శివారు పెద్ద తండాలో ఆదివారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ తండాలను పంచాయతీలుగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 5046 తండాలుండగా.. మొదటి దశలో 1756 తండాలు పంచాయతీలు కానున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించనుందని తెలిపారు. తీజ్ ఉత్సవాలను రాష్ట్రంలో ఒకేసారి నిర్వహించే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మె ల్యే సత్యవతిరాథోడ్, నాయకులు బండి వెంకటరెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నున్నా రమణ, గుగులోత్ కిషన్‌నాయక్, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ జీపీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
3 సర్పంచ్, 21 వార్డు సభ్యుల స్థానాలు 26వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ సెప్టెంబర్ 8న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఆదిలాబాద్ రూరల్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 31న ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవడం. సెప్టెంబర్ 1న అప్పీల్ చేసుకున్న వాటిని పరిష్కరించడం, 3న మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉపసంహరణ, అనంతరం అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఎన్నికల నిర్వహణ జరుగనుంది. అదే రోజున మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపు ఓటమిల జాబితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల జరిగే స్థానాలు ఇవే.. జిల్లా వ్యాప్తంగా మూడు సర్పంచ్, 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆదిలాబాద్ మండలంలోని వాన్వాట్, బజార్హత్నూర్ మండలం ధర్మపూరి, ఖానాపూర్ మండలం వెంకంపోచంపాడ్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భైంసా మండలంలోని వాలేగాం 7వ వార్డు, దండేపల్లి మండలం తల్లపేట్ జీపీలోని 3వ వార్డు, దిలావర్పూర్ మండలం సముందర్‌పల్లి జీపీలోని 5వ వార్డు, ఇచ్చోడ మండలం గేర్జం జీపీలోని 7వ వార్డు, ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి 7వ వార్డు, జైనథ్ మండలం అడ 3వ, 6వ వార్డులు, తరోడా(బి) జీపీలోని 8వ వార్డు, జైపూర్ మండలం బేజ్జల్ 4వ, ఇందారం గ్రామ పంచాయతీలోని 3వ వార్డు శెట్పల్లి జీపీలోని 9వ వార్డు, శివరాం జీపీలోని 6వ వార్డు, శివ్వరాం 6వ వార్డు, కాగజ్‌నగర్ మండలం భట్పల్లి జీపీలోని 5వ వార్డు, ఖానాపూర్ మండలం సుర్జాపూర్ జీపీలోని 3వ వార్డు, లోకేశ్వరం మండలం గఢ్చంద్ జీపీలోని 6వ వార్డు, పోట్పల్లి(బి) జీపీలోని 2వ వార్డు, మామడ మండలం పొన్కల్ 2వ వార్డు, ముథోల్ మండలం బాసర 6వ వార్డు, సారంగపూర్ మండలం పోటియా జీపీలోని 6వ వార్డు, సిర్పూర్ మండలం చోర్పల్లి జీపీలోని 5వ వార్డు, తాండూర్ మండలం కొత్తపల్లి జీపీలోని 13వ వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.