
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయాన్ని రూ 9000 కోట్లతో సామర్ధ్యం పెంపుతో అప్‌గ్రేడ్ చేయనున్నట్టు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఏటా 10 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చేలా మెరుగపరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్‌లతో కూడిన కన్సార్షియం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తోంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రెండు ప్రచురణలను మంగళవారం వెంకయ్య నాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. 2018లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ను 7 కోట్ల మంది ప్రయాణీకులు ఉపయోగించుకోగా, రానున్న సంవత్సరాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం 11 కోట్లకు పెరుగుతుందని పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయం లక్ష మందికి నేరుగా, మరో 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలను సమకూర్చిందని చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయం పదేళ్ల సేవలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment