వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త. వొడాఫాన్ ఐడియా యూజర్ల కోసం వీఐ గేమ్స్‌ను లాంచ్ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. అందుకోసం ప్రముఖ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్‌తో వొడాఫోన్ ఐడియా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
జియో తరహాలో..!
భారత్‌లో గేమింగ్ సెక్టార్ క్రమంగా పుంజుకుంటోంది. గేమ్స్ ఆడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో పలు టెలికాం సంస్థలు కూడా గేమింగ్ సెక్టార్‌పై ఇన్వెస్ట్ చేసేందుకు సిద్దమైనాయి. ఈ ఏడాది ప్రారంభంలో స్కిల్డ్ బేస్డ్ గేమింగ్ కంపెనీ జూపీతో రిలయన్స్ జియో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా గేమింగ్ సెక్టార్‌లోకి అడుగుపెట్టింది అందులో భాగంగా వీఐ నజారా టెక్నాలజీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా వొడాఫోన్ ఐడియా యూజర్లు వీఐ యాప్‌లోనే గేమ్స్ ఆడవచ్చును.
1200కు పైగా గేమ్స్..!
వీఐ యాప్‌లో యూజర్లు 1200 పైగా ఆండ్రాయిడ్, హెచ్‌టీఎంఎల్ 5 ఆధారిత మొబైల్ గేమ్స్‌ను యూజర్లు ఆడవచ్చు. యాక్షన్, అడ్వెంచర్, క్యాజువల్, ఎడ్యుకేషన్, ఫన్, పజిల్, రేసింగ్, స్పోర్ట్స్, స్ట్రాటజీ సహా మొత్తం 10 జానర్లకు చెందిన గేమ్‌లు ఉంటాయి. మొత్తంగా మూడు కేటగిరీల్లో గేమ్స్ ఉంటాయి. ఇందులో 250 గేమ్స్‌ను యూజర్ల ఉచితంగా ఆడవచ్చు. వీఐ గేమ్స్‌ను ఫ్రీ, ప్లాటినం, గోల్డ్ అనే మూడు విభిన్న టారిఫ్ స్ట్రక్చర్‌తో వొడాఫోన్ ఐడియా లాంచ్ చేసింది.
వీఐ ఉచిత గేమ్స్‌లో భాగంగా..యూజర్లు ఈ గేమ్స్‌కు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్లాటినమ్ గేమ్స్ కేటాగిరీలో..ప్రీమియమ్ గేమ్స్ ను యూజర్లు ఆడవచ్చును. అయితే ప్రతీ గేమ్ డౌన్‌లోడ్‌కు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.25, ప్రీపెయిడ్ యూజర్లు రూ.26 చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ గేమ్స్ కేటాగిరీలో భాగంగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.50, ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.56 టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది.
చదవండి: పేటీఎంపై సంచలన ఆరోపణలు..! అందుకే బ్యాన్ విధించిన ఆర్బీఐ..! క్లారిటీ ఇచ్చిన పేటీఎం
Comments
Please login to add a commentAdd a comment