వొడా-ఐడియా కస్టమర్లకు బ్యాగేజీ కవరేజ్‌  | Vodafone Idea Announces Baggage Cover for IR Postpaid Users | Sakshi
Sakshi News home page

వొడా-ఐడియా కస్టమర్లకు బ్యాగేజీ కవరేజ్‌ 

Published Fri, Mar 1 2024 7:23 AM | Last Updated on Fri, Mar 1 2024 11:01 AM

Vodafone Idea Announces Baggage Cover for IR Postpaid Users - Sakshi

ముంబై: అంతర్జాతీయ రోమింగ్‌ (ఐఆర్‌) ప్యాక్‌ను ప్రీ–బుక్‌ చేసుకునే తమ పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకి .. బ్యాగేజీపరంగా తలెత్తే సమస్యలకు సంబంధించి కవరేజీని అందిస్తున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్‌ఐడియా (వీఐ) తెలిపింది. 

బ్యాగేజీ పోయినా లేదా అందడంలో ఆలస్యం జరిగినా ఒక్కో బ్యాగ్‌కి రూ. 19,800 పరిహారం పొందవచ్చని వివరించింది. ఇందుకోసం అమెరికాకు చెందిన బ్లూ రిబ్బన్‌ బ్యాగ్స్‌ సంస్థతో వీఐ చేతులు కలిపింది. ఏప్రిల్‌ 7 వరకు జరిపే ప్రయాణాల కోసం మార్చి 21 వరకు బుక్‌ చేసుకున్న నిర్దిష్ట ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్లాన్లకు (రూ. 3,999–రూ. 5,999) ఇది వర్తిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement