Postpaid Users
-
వొడా-ఐడియా కస్టమర్లకు బ్యాగేజీ కవరేజ్
ముంబై: అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్యాక్‌ను ప్రీ–బుక్ చేసుకునే తమ పోస్ట్‌పెయిడ్ యూజర్లకి .. బ్యాగేజీపరంగా తలెత్తే సమస్యలకు సంబంధించి కవరేజీని అందిస్తున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్ఐడియా (వీఐ) తెలిపింది. బ్యాగేజీ పోయినా లేదా అందడంలో ఆలస్యం జరిగినా ఒక్కో బ్యాగ్‌కి రూ. 19,800 పరిహారం పొందవచ్చని వివరించింది. ఇందుకోసం అమెరికాకు చెందిన బ్లూ రిబ్బన్ బ్యాగ్స్ సంస్థతో వీఐ చేతులు కలిపింది. ఏప్రిల్ 7 వరకు జరిపే ప్రయాణాల కోసం మార్చి 21 వరకు బుక్ చేసుకున్న నిర్దిష్ట ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లకు (రూ. 3,999–రూ. 5,999) ఇది వర్తిస్తుంది. -
జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!
ముంబై: ఫిబ్రవరి 5న రిలయన్స్ జియో నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో రిలయన్స్ జియో సేవలలో డౌన్ కావడంతో చాలామంది రిలయన్స్ జియో వినియోగదారులు గత వారం కాల్స్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. కాల్స్ చేసేటప్పుడు "మీరు నెట్ వర్క్ లో రిజిస్టర్ కాలేదు" అనే సందేశాన్ని వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆ అసౌకర్యానికి చింతిస్తూ రిలయన్స్ జియో ఇప్పుడు ప్రభావిత వినియోగదారులకు రెండు రోజుల ఉచిత కాలింగ్, డేటా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా, రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని రెండు రోజులు పొడీగిస్తున్నట్లు పేర్కొంది. గత వారం నెట్ వర్క్ అంతరాయం వల్ల ప్రభావితమైన కస్టమర్ల పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల రెండు రోజుల వాలిడిటీ కూడా రెండు రోజులు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఇది కేవలం జియో నెట్వర్క్ వల్ల అసౌకర్యానికి గురైన వారికి మాత్రమే అని తెలియజేసింది. ఈ విషయాన్ని జియో తన వినియోగదారులకు ఒక సందేశం రూపంలో పంపుతుంది. పంపుతోంది. ఫిబ్రవరి 5న ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందాయి. (చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!) -
ఎయిర్టెల్ 30జీబీ 4 జీ డేటా అదనంగా
న్యూఢిల్లీ: టెలికాం మేజర్ భారతి ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారులకోసం సరికొత్త డేటా ప్లాన్‌ను ప్రకటించింది. జూలై 1 ఒకటినుంచి అమలయ్యేలా "మాన్సూన్ సర్ప్రైజ్" ఆఫర్‌ను తీసుకొచ్చింది. డేటా సర్ప్రైజ్ కు కొనసాగింపుగా ఈ డేటా ప్లాన్లను వెల్లడించింది. వీటిల్లో మూడు నెలలపాటు అదనంగా 30జీబీ 4 జీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ. 499, రూ.649, రూ799 ప్లాన్లలో ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ప్లాన్లను ఎంపిక చేసుకున్న తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అదనంగా ఈ ప్రయోజనాలకు సెప్టెంబరు నెల వరకు అందించనున్నామని ఎయిర్టెల్ సిఇఓ గోపాల్ విఠల్ చందాదారులకు ఇమెయిల్ సమాచారంలో తెలిపారు. ఈ ఉచిత డేటా ఆఫర్ 4జీ హ్యాండ్ సెట్లలో మాత్రమే చెల్లుతుంది. అలాగే మూడు నెలల తర్వాత ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా వెనక్కి తీసుకోబడుతుందని ఎయిర్టెల్ వెబ్సైట్లో పేర్కొంది. ఈ అదనపు 30జీబీ డేటా కోసం, ప్లేస్టోర్, లేదా ఆప్ స్టోర్ నుంచి ఎయిర్ టెల్ టీవీ ఆప్ డౌన్లోడ్ చేసిన తర్వాత, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆఫర్‌ను క్లెయిమ్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటికే డేటా సర్ప్రైజ్ ఖాతాదారులకు కూడా మూడు నెలల అదనపు డేటా వర్తిస్తుందని తెలిపింది. -
6 రెట్ల డేటా ఫ్రీ: ప్రత్యర్థులకు దడదడే
న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రత్యర్థి కంపెనీలు, ప్రయివేటు కంపెనీలకు షాకిచ్చే సంచలన ఆఫర్‌తో ముందుకువచ్చింది. తన పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులకు దాదాపు 6 రెట్ల డేటాను ఆఫర్ చేస్తోంది. జూలై1 నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించింది. తమ కొత్త ప్లాన్స్‌లో ఆరు రెట్ల డేటా ప్రయోజనాలను అందించనున్నామని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.99 ప్లాన్‌లో ఇకపై 250ఎంబీ డేటా ఫ్రీ, ఇంతకు ముందు ఉచిత డేటా సదుపాయం లేదు. రూ.225 ప్లాన్‌లో 1 జీబీ డేటా ఉచితం. ఇంతకు ముందు ఇది 200 ఎంబీ మాత్రమే. రూ.799 ప్లాన్ లో ఇకపై 3 జీబీ స్థానంలో 10జీబీడేటా అందిస్తుంది. దీంతోపాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. వినియోగదారులకు సరసమైన మరియు సమర్థవంతమైన సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ చెప్పారు. భారత టెలికాం పరిశ్రమలో ప్రస్తుత ధోరణిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. -
ఆ కంపెనీ యూజర్లకు 27జీబీ ఫ్రీ డేటా
వొడాఫోన్ తన పోస్టు పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో నెల 9జీబీ చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా డేటా అందించనున్నట్టు పేర్కొంది. మొత్తంగా 27జీబీ 4జీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ తన కస్టమర్లు రిలయన్స్ జియో నెట్ వర్క్ కు తరలిపోకుండా ఉండేందుకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే జియో తన కస్టమర్ల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కు పోటీగా కంపెనీలు సైతం పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ టెల్ సైతం తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 30జీబీ ఉచిత డేటా ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ జూలై మధ్య వరకు అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ కొత్త ఆఫర్ కింద 9జీబీ ఉచిత డేటాను పోస్టు పెయిడ్ కస్టమర్లకు వినియోగించుకోవచ్చని, ఇది ఇప్పటికే ఉన్న తన ప్లాన్స్ లో భాగమని తెలిసింది. ఇప్పటికే వొడాఫోన్ రెడ్ యూజర్లకున్న రూ.499 ప్లాన్ కింద నెలకు 3GB + 9GB డేటాను మూడు నెలల సద్వినియోగం చేసుకోవచ్చని వెల్లడవుతోంది. అదేవిధంగా 699 రూపాయల వొడాఫోన్ రెడ్ ప్లాన్ పై 5GB + 9GB డేటాను నెల పాటు పొందవచ్చు. ఈ డేటా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలంటే పోస్టు పెయిడ్ కస్టమర్లు వొడాఫోన్ వెబ్ సైట్లోకి వెళ్లి, తమ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత, ఓటీపీ నెంబర్ వస్తోంది. ఆ ఓటీపీని వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తే, ఉచిత డేటాను పొందవచ్చు. దీనికోసం వొడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలట. కంపెనీ ఇటీవలే 352 రూపాయలతో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటాను ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.