International Roaming
-
వొడా-ఐడియా కస్టమర్లకు బ్యాగేజీ కవరేజ్
ముంబై: అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్యాక్‌ను ప్రీ–బుక్ చేసుకునే తమ పోస్ట్‌పెయిడ్ యూజర్లకి .. బ్యాగేజీపరంగా తలెత్తే సమస్యలకు సంబంధించి కవరేజీని అందిస్తున్నట్లు టెలికం సంస్థ వొడాఫోన్ఐడియా (వీఐ) తెలిపింది. బ్యాగేజీ పోయినా లేదా అందడంలో ఆలస్యం జరిగినా ఒక్కో బ్యాగ్‌కి రూ. 19,800 పరిహారం పొందవచ్చని వివరించింది. ఇందుకోసం అమెరికాకు చెందిన బ్లూ రిబ్బన్ బ్యాగ్స్ సంస్థతో వీఐ చేతులు కలిపింది. ఏప్రిల్ 7 వరకు జరిపే ప్రయాణాల కోసం మార్చి 21 వరకు బుక్ చేసుకున్న నిర్దిష్ట ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లకు (రూ. 3,999–రూ. 5,999) ఇది వర్తిస్తుంది. -
ఎయిర్టెల్ మరో ఇంటర్నేషనల్ ఆఫర్
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బుధవారం మరో ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ ప్రకటించింది. వ్యాపార ప్రయాణాలు / సెలవుల్లో విదేశీ ప్రయాణించే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా బుధవారం కొత్తఆఫర్ ను లాంచ్ చేసింది. 10రోజుల వాలిడిటీ ప్యాక్ ను రూ.1,199లతో మొదలయ్యే ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, మరియు థాయ్ లాండ్లలో పర్యటించే ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ ఇన్కమింగ్ కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు ఐఆర్( ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీలు) 99 శాతం కోతపెట్టి, 3రూపాయలకే ఒక ఎంబీ , ఇండియాకు, లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్ కోసం నిమిషానికి 3 రూపాయలు చార్జ్ చేయనుంది. దీంతో వినియోగదారులు ఫ్రీ వైఫై సెంటర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, సోషల్ మీడియా, ఈ మెయిల్స్ చెకింగ్ లాంటి సేవలను నిరంతరాయంగా పొందొచ్చని తెలిపింది. మరోవైపు ఈ ప్యాక్ ఎపుడైనా యాక్టివేట్ చేసుకొని, కేవలం వాడుకున్నపుడు మాత్రమే చెల్లించే అవకాశం కల్పించడం మరో ప్రత్యేకత. సింగపూర్, థాయ్ లాండ్ లలో పూర్తి ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 2 జీబీ డాటా, ఇండియాకు 250 నిమిషాల ఉచితకాలింగ్, 100 ఎస్ ఎంఎస్ లు ఉచితంగా అందిస్తోంది. దాదాపు ఇదే తారిఫ్ తో అమెరికా, కెనడా, బ్రిటన్లలో రూ.2999 లతో మొదలయ్యే ప్యాకేజ్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయ వినియోగదారుల రోమింగ్ కోసం కొత్త 10 రోజు చెల్లుబాటయ్యే కొత్త ప్యాక్ పరిచయం సంతోషంగా ఉందని భారతీ ఎయిర్టెల్ - మార్కెట్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) అజయ్ పూరి తెలిపారు. తమ యూజర్లు ఇప్పుడు అంతర్జాతీయంగా అధిక కాల్ డేటా ఛార్జీల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 24x7 తమ సేవలను ఎంజాయ్ చేయవచ్చన్నారు. వినియోగదారులు ఎయిర్టెల్ వెబ్ సైట్, మై ఎయిర్టెల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ కేంద్రాల ద్వారా ఈజీగా ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం ఈ పట్టిక ను పరిశీలించవచ్చు. -
యూజర్ చెబితేనే ఫోన్లో నెట్ యాక్టివేషన్
న్యూఢిల్లీ : డేటా సేవలకు టెల్కోలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. యూజర్ల నుంచి స్పష్టమైన అంగీకారం పొందిన తర్వాతే టెల్కోలు వారి మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ను యాక్టివేట్ చేయాలని ప్రతిపాదించింది. అలాగే వాడకం పరిమితులు నిర్దిష్ట స్థాయిలకు దగ్గరపడగానే ఎస్ఎంఎస్/టోల్ ఫ్రీ కోడ్ ద్వారా యూజర్లకు సమాచారాన్ని తెలియజేయాలి. ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఉన్న యూజర్లు డేటా సర్వీసులు వాడదల్చుకోని పక్షంలో వాటిని డీయాక్టివేట్ చేసుకునేలా కూడా అలర్ట్‌లు పంపాలని తెలిపింది. డేటా సేవలపై రూపొందించిన ముసాయిదా నిబంధనలను ట్రాయ్ బుధవారం విడుదల చేసింది. వీటిపై సంబంధిత వర్గాలు మే 12 లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. యూజర్ అనుమతుల మేరకు డేటా సర్వీసుల ను యాక్టివేట్/డీయాక్టివేట్ చేయాలన్నా టోల్ ఫ్రీ కోడ్ 1925(యూఎస్ఎస్డీ)ని ఉపయోగించవచ్చని ట్రాయ్ పేర్కొంది.