
ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 11 ఆయన బర్త్‌డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, భారత సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్‌డే నేపథ్యంలో బిగ్ బి హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు తల్లితో కలిసి ఆయన తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కేబీసీ షోలో అడుగుపెట్టాడు.
చదవండి: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి
ఆయన షో నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగింది. ఆ తర్వాత షో అయిపోయిందా? అని అందరు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ బచ్చన్ సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. తనయుడి రాకతో బిగ్ బి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం తండ్రిని హాట్ సీట్‌లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్‌లో తను కూర్చోని అమితాబ్‌ను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా బిగ్‌బి అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక పక్కనే ఉన్న ఆయన సతీమణి జయ బచ్చన్ అమితాబ్‌ను తట్టి ఓదారుస్తున్న వీడియో నెటిజన్లు ఆకట్టుకుంది. అనంతరం షోలోనే కేక్ కట్ చేయించి తండ్రికి ఎప్పటికి గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించాడు అభిషేక్.
చదవండి: బాలీవుడ్ దిగ్గజం.. ఆయనకు గుర్తింపు అంత ఈజీగా రాలేదు
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను అభిషేక్ షేర్ చేశాడు. ‘దీని వెనుక చాలా ప్రణాళిక, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా గోప్యంగా ఇది సరిగ్గా చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇంత చేసిన ఆయనకు ఇది తక్కువే అనిపిస్తుంది. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్‌లో(కేబీసీ షో) జరుపడం సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇది భావోద్వేగానికి గురి చేసింది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్‌పతి టీంకు నా కృతజ్ఞతలు’ అంటూ అభిషేక్ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment