విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్‌ చేసిన అమితాబ్‌ | Amitabh Bachchan Shares Fractured Toe Pics | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్‌ చేసిన అమితాబ్‌

Published Sat, Oct 2 2021 11:12 AM | Last Updated on Sat, Oct 2 2021 11:36 AM

Amitabh Bachchan Shares Fractured Toe Pics - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13’ హోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ షోకి సంబంధించి నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగింది. అందులో కాలి వేళ్లకి గాయమైన అలాగే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ తన బ్లాగ్‌లో ఫోటోస్‌ పోస్ట్‌ చేశాడు బిగ్‌బీ.

‘బేస్‌ వద్ద కాలి వేలు విరిగింది. నొప్పి విపరీతంగా ఉంది. దానికి ఇలాగే ట్రీట్‌మెంట్‌ చేయలేం. కానీ దాన్ని వేరొక వేలితో కలిపి కట్టడం ద్వారా 4 లేదా 5 వారాల్లో తగ్గే అవకాశం ఉంది. నొప్పిని ప్లాస్టర్‌తో కప్పిపుచ్చలేం’ అని ఈ లెజెండరీ యాక్టర్‌ తెలిపాడు. అయితే ప్రోగామ్‌లో గాయం కనిపించకుండా ఉండేందుకు గుంట లాంటి బూట్లు ధరించానని నటుడు చెప్పాడు. అయినప్పటికీ కెబీసీ షూటింగ్‌ని ఎంజాయ్‌ చేసినట్లు అమితాబ్‌ పేర్కొన్నాడు. అయితే ట్రెడీషనల్‌ లుక్‌లో ఉన్న బిగ్‌బీ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

కాగా, అమితాబ్‌ ఈ సమయంలోనూ  ఇమ్రాన్ హష్మీతో కలిసి సస్పెన్స్ థ్రిల్లర్ ‘చెహ్రే’, అలియా భట్, రణబీర్ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మస్త్ర’, ప్రాజెక్ట్ కె, గుడ్‌బాయ్‌ వంటి సినిమాలు చే​స్తూ బిజీగా ఉన్నాడు.

చదవండి: కాళ్లతో అమితాబ్‌ పెయింటింగ్‌ వేసిన అభిమాని.. నెటిజన్లు ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement