ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నాటి 8వ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయడం కంటతడి పెట్టిస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అస్మితా మాధవ్ గోరే 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో 12.5లక్షల రూపాయలతో వెళ్లి పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అందరి మన్ననలు అందుకుంది. ఇక అస్మితా చెప్పలేకపోయిన 13వ ప్రశ్న ఏమిటంటే..1905లో బెంగాల్ విభజనకు నిరసనగా, ప్రజల్లో ఐక్యతను చాటిచెప్పేలా జరుపుకున్న పండుగ ఏది? ఇక ఆప్షన్స్ వచ్చి దసరా, రక్షా బంధన్, ఈద్ లేదా ఈస్టర్ ఆదివారం. సరైన సమాధానం రక్షా బంధన్. ఇక్కడితో అన్ని లైఫ్‌లైన్‌లు అయిపోయాయి. ఇక తరువాతి ప్రశ్నలకు అస్మితా సమాధానం చెప్పాలి. కరెక్ట్ అయితే ముందుకు వెళ్తుంది.. లేదంటే క్విట్ చెప్పాలి. 25 లక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్ చెప్పిసింది. దీంతో దాంతో 12.5లక్షల రూపాయలతో ఇంటికి వెళ్లింది. (కేబీసీ12 సీజన్ 25 లక్షల ప్రశ్న.. ఆన్సర్ చెప్పండి)
తనకు వచ్చిన ఈ డబ్బుతో తన సోదరుడు, చెల్లి విద్యను పూర్తి చేయడానికి ఉపయోగిస్తానని అస్మితా వెల్లడించింది. ఆమె తండ్రి 100% అంధుడు కాగా, తల్లికి 40% దృష్టి లోపం ఉందని పేర్కొంది. చాలా చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలను ఆస్మిత చూసుకుంటుందని తల్లి చెప్పడంతో అమితాబ్ సహా టీవీ చూస్తున్న ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన తండ్రికి చూపు లేనంత మాత్రానా తనకు ఎలాంటి లోటు తెలియకుండా చూసుకున్నారని, అందరితో ప్రమేగా మెలుగుతారని అస్మితా తెలిపింది. 25 లక్షలు గెలుచుకోలేకపోయిన ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో ప్రసారం అయ్యే ఈ షో లాక్‌డౌన్ అనంతరం చాలా గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 28 న ప్రారంభమైంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రదర్శన అన్ని చివరి సీజన్లకు భిన్నంగా ఉంది. ప్రదర్శనలో ప్రత్యక్ష ప్రేక్షకులు లేవడం ఇదే మొదటిసారి. (బిగ్ బీకి జాబ్ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్)
Comments
Please login to add a commentAdd a comment