
సాక్షి, ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మొదటిసారిగా కోటి రూపాయల నగదును గెలుచుకున్న నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించింది. ఈనెల 11న ప్రసారం కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించి సోనీ టీవీ తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఎంతో ఉత్కంఠ నడుమ అమితాబ్ లేచి (ఏక్ కరోడ్) కోటి రూపాయలు గెలుచుకున్నారు అంటూ హర్షం వ్యక్తం చేశారు. కష్టమైన ప్రశ్న ఎదురైన ప్రతీసారి చాలా చక్కగా ఆలోచించి సమాధానం చెప్పావంటూ ఆమెను కొనియాడారు. దీంతో ఈ సీజన్‌లో మొదటి కరోడ్‌పతిగా ఢిల్లీకి చెందిన కమ్యూనికేషన్ మేనేజర్ నజీయా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. (రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా? )
అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్‌పాక్ ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయ్యింటుంది? నజియా సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం 11న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడాల్సిందే. ఇంతకుముందు సీజన్‌లో ఢిల్లీకి చెందిన ఛవికుమార్ అనే మహిళ కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక రూ.50 లక్షలు గెలుచుకొని కోటి రూపాయల షో నుంచి వైదొలిగారు. కాగా కేబీసీసీజన్ 12 సెప్టెంబర్ సెప్టెంబరు 28న ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా అనేక జాగ్రత్తల నడుమ ఈ షోను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే ఆడిషన్స్ నిర్వహించారు. అంతేకాకుండా ఈసారి తొలిసారిగా ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఎత్తివేశారు. ('కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..)
Comments
Please login to add a commentAdd a comment