
ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 12వ సీజన్ 12 కొనసాగుతోంది. ఈ సీజన్‌లో మొదటిసారిగా కోటి రూపాయల నగదును గెలుచుకున్న నజియా నసీమ్ అనే మహిళ రికార్డ్ సృష్టించింది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ కంటెస్టెంట్‌గా నిలిచారు. ఈ విషయాన్ని సోని ఎంటర్‌టైన్‌మెంట్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్‌పాక్ ప్రశ్నకు చేరుకోగలిగారు. మరి 7కోట్లు గెలచుకునే ఆ ప్రశ్న ఏమయ్యింటుంది? నజియా సమాధానం చెప్పిందా లేక వెనుతిరిగిందా అన్నది తెలియాలంటే మాత్రం 17న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ చూడాలి.ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ ప్రసారం చేసింది. (కోటి రూపాయలు గెలుచుకున్న ఢిల్లీ మహిళ)
ఇంతకుముందు ఎపిసోడ్‌లో కూడా నటి రత్నా ప్రతాక్ షా, స్వయం డైరెక్టర్, వ్యవస్థాపకురాలు కరమ్‌వీర్ అనురాధ కపూర్‌లు ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల గెలుచుకున్నారు. రూబి సింగ్ అనే మరో కంటెస్టెంట్ కూడా ఈ ఎపిసోడ్‌లోనే రూ. 25 లక్షలు గెలుచుకోవడం విశేషం. ఒకరి త్వరాత ఒకరూ హాట్‌సీట్‌కు వెళ్లిన వీరిద్దరూ 14వ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక తప్పుకున్నారు. ('కేబీసీ' చరిత్రలోనే మొట్టమొదటిసారిగా..)
Comments
Please login to add a commentAdd a comment