కౌన్‌బనేగా కరోడ్‌పతి ఈ షోకు ఎంత ప్రముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సంవత్సరాలుగా సామాన్యులను బుల్లితెరపై చూపెడుతూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతోంది కౌన్‌బనేగా కరోడ్‌పతి షో. ప్రస్తుతం కౌన్‌బనేగా కరోడ్‌పతి సీజన్ 12 నడుస్తోంది. దీనిలో తాజా కంటెస్టెంట్ మృణాళిక దుబే ఈ సీజన్‌లో మొదటి సారి 50 లక్షల రూపాయల ప్రశ్నను ఎదుర్కొన్నారు. అయితే ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక షో నుంచి తప్పుకున్నారు. ఇంతకీ ఆమెను అడిగిన ప్రశ్న ఏంటి? మీకు సమాధానం తెలుసేమో ఒక్కసారి చూడండి.
అసలు మృణాళిక ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. మృణాళిక నాసిక్‌కు చెందిన ఒక సాధారణ గృహిణి. ఆమె కథలు రాస్తూ ఉంటారు. ఆమెకు 17 లక్షల మంది రీడర్స్ కూడా ఉన్నారు. ఆమె మొదటి లైఫ్‌లైన్ రూ. 80,000 ప్రశ్న దగ్గర తీసుకుంది. తరువాత కూడా వరుసగా రెండు లైఫ్‌లైన్లను వాడుకుంది. 12వ ప్రశ్న రూ. 25 లక్షల ప్రశ్నకు సొంతంగా సమాధానం చెప్పింది. తరువాత రూ.50,00,000 ప్రశ్నకు సమాధానం చెప్పలేక, అప్పటికే లైఫ్‌లైన్స్ అన్ని అయిపోవడంతో షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇంతకీ ఆమెను అడిగిన ప్రశ్న ఏంటంటే ఒలంపిక్స్‌లో ఇప్పటికి వరకు ఉమెన్ కేటగిరిలో ఎక్కువ మెడల్స్ పొందిన క్రీడాకారిణి ఎవరు? దానికి ఆపన్ష్‌లుగా బిర్గిట్ ఫిషర్, లారిసా లాటినినా, జెన్నీ థాంప్సన్, పోలినా అస్తాఖోవా ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లారిసా లాటినినా. గురువారం కావడంతో ఆమె తరువాత గెస్ట్ డాక్టర్ ష్రాఫ్, రితేష్‌దేశ్ ముఖ్ హాట్ సీట్‌లో కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment