కేబీసీ కరమ్‌వీర్‌లో అచ్యుత సామంత | Achyuta Samanta In KBC Karamveer | Sakshi
Sakshi News home page

కేబీసీ కరమ్‌వీర్‌లో అచ్యుత సామంత

Published Thu, Nov 14 2019 5:04 PM | Last Updated on Thu, Nov 14 2019 5:11 PM

Achyuta Samanta In KBC Karamveer - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోని టెలివిజన్‌ ఛానెల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు ‘కరమ్‌వీర్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇందులో వివిధ రంగాల్లో దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రముఖలను పరిచయం చేస్తారు. ఈసారి అతిథిగా కలింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (కిస్‌), కలింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ (కేఐఐటి) పేరిట సంస్థలను ఏర్పాటు చేసి అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ ఆదర్శంగా నిలవడంతోపాటు, ఒడిశాలోని కందమహల్‌ నుంచి బీజేడీ ఎంపీగా విజయం సాధించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత్‌ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ప్రముఖ సినీ నటి తాప్సీ పన్ను సహకరిస్తున్నారు. యథావిధిగా ఈ కార్యక్రమాన్ని అతిథేయిగా అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించారు.

బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఉన్నత విద్యా సంస్థలు స్థాపించే వరకు తాను ఎదిగిన తీరు, దాతృత్వం, దయాగుణం తనకు అబ్బిన విధంతోపాటు ఇప్పుడు పాలనాదక్షుడిగా ఎదిగిన తీరును అచ్యుత సామంత ఇందులో వివరిస్తారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన ఆయన సోదరి ఇతి రాజ సామంత కూడా కార్యక్రమానికి వస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కోసం అచ్యుత సామంత, ఒడిశాలో ప్రసిద్ధి చెందిన ‘చెన్న పొడ’ తిను పదార్థాన్ని, తన కిస్‌ సంస్థ విద్యార్థులు వేసిన పెయింటింగ్‌ను బహమతిగా తీసుకెళ్తున్నారు. ఆయన ఇంతకుముందు ఎన్‌డీటీవీలో అమితాబ్‌ నిర్వహించిన ‘బనేగా స్వచ్ఛ్‌ ఇండియా’ కార్యక్రమంలోనూ అతిథిగా పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement