ముంబై : అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 12వ సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే హాట్ సీట్‌లోకి వెళ్లాలంటే మొదట ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడాల్సి ఉంటుంది. కానీ గురువారం నాటి ఎపిసోడ్‌లో మాత్రం మొదటిసారిగా ఓ కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడకుండానే డైరెక్ట్‌గా గేమ్‌లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే ప్రతి 10 మందిలో 8 మంది మాత్రమే హాట్‌సీట్‌లోకి వెళ్తారు. కరోనా కారణంగా ఈ వారం కేవలం ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే హాజరైన నేపథ్యంలో చివరి అవకాశంగా కోల్‌కత్తాకి చెందిన రూనా షాహా అనే 43 ఏళ్ల మహిళకు ఈ అరుదైన అవకాశం వరించింది. దీంతో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడకుండానే హాట్‌సీట్‌లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచారు. (రూ. 50లక్షల ప్రశ్నకు సమాధానం తెలుసా?)
2001 నుంచి కేబీసీ షో కోసం ఆమె ప్రయత్నిస్తునే ఉన్నాననే ఇదే విషయమై తన భర్త సరదాగా ఆటపట్టించే వారని తెలిపింది. దీంతో ఈ సీజన్‌లో చివరి ఇంటర్వ్యూలు ముగిసే వరకు తన భర్తకు చెప్పలేదని పేర్కొంది. కోల్‌కతాలో చీరల వ్యాపారం చేస్తూ స్వశక్తిగా ఎదగాలని, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూ ఉంటానని తెలిపింది. అంతేకాకుండా తన భర్త అమితాబ్‌కు వీరాభిమాని అని, ఈ షోలో గెలిచిన డబ్బుతో తన భర్తకు ఆడి కారు కొని బహుమతిగా ఇస్తానని వెల్లడించింది. జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తాను కేబీసీ షోకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈరోజు షోలో రూనా ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారో తెలుస్తుంది. (25 లక్షల ప్రశ్న..ఎమోషనల్ అయిన బిగ్‌బి)
Meet our contestant RUNA SAHA tonight at 9 pm in #KBC12 only on Sony TV. @SrBachchan @SPNStudioNEXT pic.twitter.com/4d2jxHhUyX
— sonytv (@SonyTV) October 15, 2020
Comments
Please login to add a commentAdd a comment