
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ పతాక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. సోనీ టీవీలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో సింధు తన కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. సింధూ తన అక్కతో ఆడిన ఈ గేమ్‌లో బిగ్‌బీ అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్నారు. అయితే షో ప్రారంభానికి ముందు కోచ్ పుల్లెల గోపిచంద్ నుంచి ప్రత్యేక మెసేజ్‌తో ఆమె ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ షోలో పాల్గొనే ముందే సింధు గెలుచుకున్న ప్రైజ్‌మనీ పేద క్యాన్సర్ బాధితులకు అందజేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment