రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా.. | Sakshi
Sakshi News home page

రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా..

Published Tue, Jan 30 2024 11:49 AM

How Barter System Converted To Coins - Sakshi

భూమి మీద దాదాపు అన్నింటికీ డబ్బు కావాల్సిందే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్‌. ఇది మనల్ని ఎంతలా మార్చేసిందంటే మృగాలను వేటాడి పొట్టనింపుకునే ఆదిమానవులుగా ఉండే మనుషులను రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. అంతేకాదు పగలు, రాత్రి డబ్బుకోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది.

ఈ డబ్బుకు ఇంత పవర్‌ ఎలా వచ్చిందో తెలుసా. ఇప్పుడు మనం ప్రతివస్తువు కొనేందుకు వాడే రూపాయి ఎలా పుట్టిందనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా?.. డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో.. మన దేశంలో ఈ డబ్బు ఎలా చలామణైందో.. రాళ్ల నుంచి ‘ఈ-రుపీ’ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

డబ్బు అంటే తెలియని కాలమది. కొన్ని రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం దాదాపు 6000 ఏళ్ల కింద ఇరాక్‌లోని మెసపటోమియా ప్రాంతంలో చిన్న గుంపులుగా మనుషులు జీవించేవారు. వారికి తెలిసింది ఒక్కటే. వేటకు వెళ్లి పొట్ట నింపుకుని మళ్లీ పూటకోసం వేటకు వెళ్లడం. ఆ క్రమంలో కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. ఇంకొన్ని రోజులు ఆహారం దొరకదు. కానీ ప్రతిరోజూ ఆకలైతే వేస్తుంది కదా. ఇలా వేర్వేరు గుంపులుగా వేటకు వెళ్లే వారిలో కొన్ని గుంపులోని వారికి కొన్ని రోజులు, మరికొన్ని గుంపులకు ఇంకొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది. ఇలా అయితే కష్టం అని భావించి కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే ‘బార్టర్‌ సిస్టమ్‌’. 

బార్టర్‌ సిస్టమ్‌..
బార్టర్‌ సిస్టమ్‌లో భాగంగా ఆ గుంపుల్లోని వారివద్ద ఉన్న ఆయుధాలు ఇతర పరికరాలను వేరే గుంపులకు ఇచ్చి దానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవారు. ఇలా మొదలైన ఈ పద్ధతి చాలా ఏళ్లే కొనసాగింది. ఇలా జరుపుతున్న లావాదేవీలు ఏరోజుకు ఆరోజు సెటిల్‌ అయితే ఫర్వాలేదు. కానీ అలా సెటిల్‌కాకుండా తర్వాత రోజుల్లో సెటిల్‌ చేసుకోవాలనుకుంటే వాటిని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వివరాలను రాళ్లపై నోట్‌ చేసుకునేవారు. ఇలా అకౌంటింగ్‌ మొదలైంది. 

రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బార్టర్‌ సిస్ట్‌మ్‌తో కొత్త సమస్య వచ్చింది. ఇందులో ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ఇవ్వాల్సిందే కదా. అయితే బదులుగా ఇచ్చేవాటిలో కొన్ని ఎదుటివారికి అవసరం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చేది. దాంతో విలువైన వస్తువులు తీసుకుని జంక్‌ వస్తువులు ఇచ్చేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైనా వస్తువుకు బదులుగా ఒకే వస్తువును పరిగణించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు, విక్రయాలు జరిపినా ఆ వస్తువును మార్చుకుందామని భావించి కమొడిటీస్‌ను ఇచ్చిపుచ్చుకునేవారు. 

గవ్వలతో ట్రేడింగ్‌..
కమొడిటీస్‌ అంటే ఇప్పటిలాగా బంగారం, వెండీ కాదు. వీటికి బదులుగా ట్రేడ్‌ కోసం మొదటగా వాడిన వస్తువు గవ్వలు. అప్పట్లో హిందూమహాసముద్రంలో దిరికే అరుదైన ఈ గవ్వలను ట్రేడింగ్‌ కోసం వినియోగించేవారు. వాటిని విలువైన వస్తువులగా పరిగణించేవారు. అందుకే చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, సినిమాల్లో వారు ధరించే వస్తువులు, దుస్తులు గవ్వలతో తయారుచేసి ఉంటాయి. తర్వాత రోజుల్లో మిరియాలు, ఉప్పు, పూసలు, రంగురాళ్లు, కుండలు.. వంటి అరుదైన వాటిని మనీగా వినియోగించేవారు. ఈ పద్ధతి ఇంకొన్నేళ్లు సాగింది. తర్వాత లోహం ఆవిష్కరించారు. దాంతో మెటల్‌ నాణెన్ని తయారుచేశారు. 

నాణెం పుట్టుక..
భారత్‌లో ముందుగా నాణెం పుట్టింది ఆరో శతాబ్దంలో అని పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాలు అనే రాజులు ఈ కాయిన్‌లను ముద్రించారు. వాటికి పురాణా, కష్యపణాలు, పణాలు అని పిలిచేవారు. ఇలా ముద్రించిన వాటికి ఎలాంటి ఆకారం ఉండేదికాదు. తర్వాతకాలంలో మౌర్యులు గ్రీక్‌ను గమనించి ప్రత్యేక మార్కుతో వివిధ మెటల్స్‌తో నాణేలు ముద్రించారు. బంగారు నాణేలను సువర్ణరూప, రాగి నాణెలను తామరరూప, వెండి నాణెలను రూప్యరూప అని పిలిచేవారని చంద్రగుప్తుడికి మంత్రిగా ఉన్న చాణుక్యుడు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అయితే ఈ నాణెలు ఎవరు తయారుచేశారో వాటిపై ఉన్న గుర్తులనుబట్టి తెలుసుకునేవారు. నాణేలపై ఎలుగుబంటి ముంద్రించి ఉంటే చాణుక్యులదని, ఎద్దు ఉంటే పల్లవులదని, పులి ఉంటే చోళులదని.. తెలుసుకునేవారు.

ఇదీ చదవండి: టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు?

రుపీయే నుంచి రూపాయిగా..

దేశంలో మొఘలులు వచ్చాకే అప్పటివరకు వివిధ రూపాల్లో చలామణి అయిన నాణెలు రూపాయిగా మారింది. 1526 ఏడీలో మొఘల్‌ చక్రవర్తి షేర్‌షాసూరి 178 గ్రాముల సిల్వర్‌ కాయిన్‌ను రుపియేగా ప్రకటించారు. ఈ ఒక్క కాయిన్‌కు 48 కాపర్‌కాయిన్‌లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్‌కాయిన్‌లను దామ్‌గా పిలిచేవారు. 168 గ్రాములుగా ముద్రించే బంగారు కాయిన్‌లను మొహుర​్‌గా పిలిచేవారు. ఇలా రూపాయి ఎన్నో రూపాలు మార్చుకుంది. కాలంగడుస్తున్న కొద్దీ ఈ రూపీయేలను స్టోర్‌ చేయాలంటే కష్టమయ్యేది. దాంతో చైనా పేపర్‌ మనీని ఆవిష్కరించి వాడుకలోకి తీసుకొచ్చింది. ఇలా రూపాలు మారుతూ చివరికి అవీ అంతరిస్తూ ‘ఈ-రుపీ’ వాడేరోజులు వచ్చాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement