Accounting System
-
రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా..
భూమి మీద దాదాపు అన్నింటికీ డబ్బు కావాల్సిందే. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బు మనుషులకు ఒక ఎడిక్షన్. ఇది మనల్ని ఎంతలా మార్చేసిందంటే మృగాలను వేటాడి పొట్టనింపుకునే ఆదిమానవులుగా ఉండే మనుషులను రాజ్యాలను శాసించే రాజులుగా మార్చింది. అంతేకాదు పగలు, రాత్రి డబ్బుకోసం కష్టపడే బానిసలుగా కూడా మార్చింది. ఈ డబ్బుకు ఇంత పవర్ ఎలా వచ్చిందో తెలుసా. ఇప్పుడు మనం ప్రతివస్తువు కొనేందుకు వాడే రూపాయి ఎలా పుట్టిందనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా?.. డబ్బు ఎప్పుడు, ఎందుకు, ఎలా తయారైందో.. మన దేశంలో ఈ డబ్బు ఎలా చలామణైందో.. రాళ్ల నుంచి ‘ఈ-రుపీ’ వరకు ఎలా రూపాంతరం చెందిందో ఈ కథనంలో తెలుసుకుందాం. డబ్బు అంటే తెలియని కాలమది. కొన్ని రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం దాదాపు 6000 ఏళ్ల కింద ఇరాక్‌లోని మెసపటోమియా ప్రాంతంలో చిన్న గుంపులుగా మనుషులు జీవించేవారు. వారికి తెలిసింది ఒక్కటే. వేటకు వెళ్లి పొట్ట నింపుకుని మళ్లీ పూటకోసం వేటకు వెళ్లడం. ఆ క్రమంలో కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. ఇంకొన్ని రోజులు ఆహారం దొరకదు. కానీ ప్రతిరోజూ ఆకలైతే వేస్తుంది కదా. ఇలా వేర్వేరు గుంపులుగా వేటకు వెళ్లే వారిలో కొన్ని గుంపులోని వారికి కొన్ని రోజులు, మరికొన్ని గుంపులకు ఇంకొన్ని రోజులు ఆహారం ఎక్కువగా దొరికేది. ఇలా అయితే కష్టం అని భావించి కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే ‘బార్టర్ సిస్టమ్’. బార్టర్ సిస్టమ్.. బార్టర్ సిస్టమ్‌లో భాగంగా ఆ గుంపుల్లోని వారివద్ద ఉన్న ఆయుధాలు ఇతర పరికరాలను వేరే గుంపులకు ఇచ్చి దానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవారు. ఇలా మొదలైన ఈ పద్ధతి చాలా ఏళ్లే కొనసాగింది. ఇలా జరుపుతున్న లావాదేవీలు ఏరోజుకు ఆరోజు సెటిల్ అయితే ఫర్వాలేదు. కానీ అలా సెటిల్కాకుండా తర్వాత రోజుల్లో సెటిల్ చేసుకోవాలనుకుంటే వాటిని గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా వస్తువులు ఇచ్చిపుచ్చుకునే వివరాలను రాళ్లపై నోట్ చేసుకునేవారు. ఇలా అకౌంటింగ్ మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బార్టర్ సిస్ట్మ్తో కొత్త సమస్య వచ్చింది. ఇందులో ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు ఇవ్వాల్సిందే కదా. అయితే బదులుగా ఇచ్చేవాటిలో కొన్ని ఎదుటివారికి అవసరం లేకపోయినా తీసుకోవాల్సి వచ్చేది. దాంతో విలువైన వస్తువులు తీసుకుని జంక్ వస్తువులు ఇచ్చేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైనా వస్తువుకు బదులుగా ఒకే వస్తువును పరిగణించాలని నిర్ణయించుకున్నారు. కొనుగోలు, విక్రయాలు జరిపినా ఆ వస్తువును మార్చుకుందామని భావించి కమొడిటీస్‌ను ఇచ్చిపుచ్చుకునేవారు. గవ్వలతో ట్రేడింగ్.. కమొడిటీస్ అంటే ఇప్పటిలాగా బంగారం, వెండీ కాదు. వీటికి బదులుగా ట్రేడ్ కోసం మొదటగా వాడిన వస్తువు గవ్వలు. అప్పట్లో హిందూమహాసముద్రంలో దిరికే అరుదైన ఈ గవ్వలను ట్రేడింగ్ కోసం వినియోగించేవారు. వాటిని విలువైన వస్తువులగా పరిగణించేవారు. అందుకే చరిత్రలోని కొన్ని సన్నివేశాలు, సినిమాల్లో వారు ధరించే వస్తువులు, దుస్తులు గవ్వలతో తయారుచేసి ఉంటాయి. తర్వాత రోజుల్లో మిరియాలు, ఉప్పు, పూసలు, రంగురాళ్లు, కుండలు.. వంటి అరుదైన వాటిని మనీగా వినియోగించేవారు. ఈ పద్ధతి ఇంకొన్నేళ్లు సాగింది. తర్వాత లోహం ఆవిష్కరించారు. దాంతో మెటల్ నాణెన్ని తయారుచేశారు. నాణెం పుట్టుక.. భారత్‌లో ముందుగా నాణెం పుట్టింది ఆరో శతాబ్దంలో అని పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాలు అనే రాజులు ఈ కాయిన్లను ముద్రించారు. వాటికి పురాణా, కష్యపణాలు, పణాలు అని పిలిచేవారు. ఇలా ముద్రించిన వాటికి ఎలాంటి ఆకారం ఉండేదికాదు. తర్వాతకాలంలో మౌర్యులు గ్రీక్‌ను గమనించి ప్రత్యేక మార్కుతో వివిధ మెటల్స్‌తో నాణేలు ముద్రించారు. బంగారు నాణేలను సువర్ణరూప, రాగి నాణెలను తామరరూప, వెండి నాణెలను రూప్యరూప అని పిలిచేవారని చంద్రగుప్తుడికి మంత్రిగా ఉన్న చాణుక్యుడు తెలిపినట్లు పురాణాల్లో ఉంది. అయితే ఈ నాణెలు ఎవరు తయారుచేశారో వాటిపై ఉన్న గుర్తులనుబట్టి తెలుసుకునేవారు. నాణేలపై ఎలుగుబంటి ముంద్రించి ఉంటే చాణుక్యులదని, ఎద్దు ఉంటే పల్లవులదని, పులి ఉంటే చోళులదని.. తెలుసుకునేవారు. ఇదీ చదవండి: టీవీల ధరలు మరింత పెరుగుతాయా.. ఎందుకు? రుపీయే నుంచి రూపాయిగా.. దేశంలో మొఘలులు వచ్చాకే అప్పటివరకు వివిధ రూపాల్లో చలామణి అయిన నాణెలు రూపాయిగా మారింది. 1526 ఏడీలో మొఘల్ చక్రవర్తి షేర్షాసూరి 178 గ్రాముల సిల్వర్ కాయిన్‌ను రుపియేగా ప్రకటించారు. ఈ ఒక్క కాయిన్‌కు 48 కాపర్కాయిన్లు ఇవ్వాల్సి వచ్చేది. ఈ కాపర్కాయిన్లను దామ్‌గా పిలిచేవారు. 168 గ్రాములుగా ముద్రించే బంగారు కాయిన్లను మొహుర్గా పిలిచేవారు. ఇలా రూపాయి ఎన్నో రూపాలు మార్చుకుంది. కాలంగడుస్తున్న కొద్దీ ఈ రూపీయేలను స్టోర్ చేయాలంటే కష్టమయ్యేది. దాంతో చైనా పేపర్ మనీని ఆవిష్కరించి వాడుకలోకి తీసుకొచ్చింది. ఇలా రూపాలు మారుతూ చివరికి అవీ అంతరిస్తూ ‘ఈ-రుపీ’ వాడేరోజులు వచ్చాయి. -
‘లెక్క’ తేలుస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అకౌంటింగ్ టీమ్స్‌ను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం, ర్యాలీలు, బహిరంగ సభలు తదితర కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న సొమ్మును ఆడిట్ చేస్తారు. ఎన్నికల సామాగ్రికి ఎంత ఖర్చు చేసిందీ తెలుసుకుంటారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...ముïÙరాబాద్ నియోజకవర్గానికి చార్మినార్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ మీర్జా రాజా అలీ, జీపీఎఫ్ సెక్షన్‌కు చెందిన అజయ్కుమార్లను అకౌంటింగ్ ఆఫీసర్లుగా నియమించారు. మలక్‌పేటకు కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్మోహన్, ఖైరతాబాద్ జోన్ జూనియర్ ఆడిటర్ అనిల్‌కుమార్‌ను నియమించారు. అంబర్‌పేటకు కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఆడిటర్ కె.నరేందర్‌లను, ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూకట్ పల్లి జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రాజు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ బాబును నియమించారు. అలాగే జూబ్లీహిల్స్‌కు ఖైరతాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమార స్వామి, సనత్‌నగర్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మజ రాణి, జూనియర్ ఆడిటర్ భరత్, నాంపల్లికి శేరిలింగంపల్లి జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ లెనిన్ బాబు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ ఫర్జానా బేగం, కార్వాన్కు ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీలత, కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ భారతి, గోషామహల్ నియోజకవర్గానికి పీడీఎస్జడ్ –2 సూపరింటెండెంట్ ముబీన్ ఫాతి మా, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్‌లను నియమించారు. అలాగే చారి్మనార్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సయ్యద్ జియా ఉల్లా హుస్సేన్, చార్మినార్ సర్కిల్ హెల్త్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.డి ఖాదిర్ అలీ చాంద్రాయణగుట్టకు చార్మినార్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ముబాస్సిర్ హుస్సేన్ ఖాన్, జూనియర్ అసిస్టెంట్ సాగర్ సక్సేనా, యాకుత్‌పురా నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, బహదూర్‌పురా నియోజకవర్గానికి ఎల్బీనగర్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమోహన్, జూనియర్ అసిస్టెంట్ బావ్మాతి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎల్బీనగర్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సంజన, జూనియర్ అసిస్టెంట్ స్రవంతి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఆడిట్ సెక్షన్ సీడీఓ పరమేశ్వరి, ఎఫ్ఏ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సురేష్లను నియమించారు. వీరితోపాటు మరికొందరిని రిజర్వుగా ఉంచారు. -
టెక్నాలజీతో అకౌంటింగ్ వ్యవస్థల్లో పారదర్శకత
ముంబై: పారదర్శకమైన అకౌంటింగ్ వ్యవస్థల కోసం టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం అవసరమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సదస్సును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్‌సీఏ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆర్థిక సుస్థిరతకు, ప్రజలకు స్థిరమైన ఉపాధి, స్థిరమైన తయారీ, సేవలకు సైతం పారదర్శక అకౌంటింగ్ వ్యవస్థ అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. విశ్వాసం, నైతిక పరమైన అకౌంటింగ్ విధానాలు లేకుండా పారదర్శకత సాధ్యపడదన్నారు. వెబ్ 3.0 వంటి వినూన్న టెక్నాలజీలు ఇప్పటికే మన జీవితంలో భాగమయ్యాయంటూ, వ్యాపార నిర్వహణ విధానాన్ని సైతం ఎంతో మార్చేయగలవన్నారు. బ్లాక్‌చైన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నవి అకౌంటింగ్ విధానాలను మెరుగుపరచడమే కాకుండా.. టెక్నాలజీ, మెషిన్ ఆధారిత వేగవంతమైన నిర్ణయాలకు వీలు కల్పిస్తాయని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో మరింత పారదర్శకత అవసరాన్ని ప్రస్తావించారు. దీనికి మూలస్తంభం పారదర్శకమైన అకౌంటింగ్ అని గుర్తు చేశారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీన్ని నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. రెన్యువబుల్ ఎనర్జీపై పెట్టుబడులు పెంచాలి పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. భారత్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఏఐఐబీ ప్రెసిడెంట్ జిన్ లికున్ మంత్రి సీతారామన్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. బ్యాంకుకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భారత్‌లో ఏఐఐబీ పోర్ట్‌ఫోలియో విస్తరణ (మరిన్ని రుణాల మంజూరు)ను అభినందిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్ కోరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంప్రదింపులకు వీలుంటుందని మంత్రి సూచించినట్టు తెలిపింది. ఏఐఐబీలో భారత్ 7.74 శాతం వాటాతో రెండో అతిపెద్ద ఓటింగ్ హక్కుదారుగా ఉంది. చైనాకు 29.9 శాతం వాటా ఉంది. ఏఐఐబీ బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. -
AP: గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం
సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులకు వీలుగా ప్రతి పంచాయతీ పేరిట బ్యాంకుల్లో ముందస్తుగానే నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ పేరిట ఇప్పటికే బ్యాంకుల్లో (వ్యక్తిగత ఖాతాలను) పీడీ ఖాతాలను తెరిచింది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతి తీసుకోవడం వంటివి కూడా ఉండవు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేటాయించే దాదాపు రెండు వేల కోట్లకు పైగా నిధులను ఏటా ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశముంది. అకౌంట్ టూ అకౌంట్‌కి మాత్రమే బదిలీ గ్రామాలకు కొత్తగా పూర్తిస్థాయి నిధులను అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీల పేరిట బ్యాంకులో తెరిచిన పీడీ ఖాతాల నుంచి సర్పంచి సైతం ముందుగా డబ్బులు డ్రా చేసుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ఖాతాల్లో జమయ్యే నిధులను చెక్కులతోనూ డ్రా చేసుకోవడానికి వీలుండదు. గ్రామ పంచాయతీలో వివిధ ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘గ్రామ స్వరాజ్య’ ఈ–పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తాన్ని ఏ వ్యక్తికి అందజేయాలో అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను సర్పంచి అనుమతితో గ్రామ కార్యదర్శి ఆ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పోర్టల్ పంచాయతీ అకౌంట్‌కు అనుసంధానమై ఉంటుంది. వివరాలు నమోదు ప్రక్రియ పూర్తవగానే గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి బిల్లు మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతాయి. ఇందుకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతులు, లేదా ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా ఎక్కడా ఉండదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ఈ లావాదేవీల వివరాల సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరికీ తెలుస్తుంది. ఒకసారి లావాదేవీ పూర్తయ్యాక అందుకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలుండదు. ఆన్లైన్లో నమోదు చేసే బిల్లులపై ప్రభుత్వం ఏటా ఆడిట్ నిర్వహిస్తుంది. తప్పులు దొర్లితే సంబంధిత సర్పంచి, గ్రామ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానానికి చంద్రబాబు ‘నో’ గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నియంత్రణ లేకుండా 2018 నుంచి పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల స్థాయిలోనే ఆ నిధులు అందుబాటులో ఉంచాలని 2017లోనే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది. కానీ, ఈ ప్రతిపాదనకు అప్పట్లోని చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది. పూర్తిస్థాయి గ్రామ స్వరాజ్యం దిశగా.. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీలోనూ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ప్రభుత్వోద్యోగులు ఉండేవారు కాదు. జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి గ్రామంలోనూ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఇందుకోసం ఏకంగా 1.34 లక్షల మందిని నియమించారు. నగరాలతో సమానంగా మారుమూల కుగ్రామాల్లో సైతం 543 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనినైనా సొంత గ్రామంలోనే పూర్తిచేసుకునే సౌలభ్యం కల్పించింది. దీనికి తోడు.. ప్రాధాన్యతా క్రమంలో గ్రామ అవసరాలకు పంచాయతీ స్థాయిలోనే బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా రాష్ట్రంలో గ్రామాలు ఇప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సాగుతున్నాయి. ఐదేళ్లకు రూ.10,231కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్ల పాటు రూ.10,231 కోట్లు మేర రాష్ట్రంలోని గ్రామాలకు కేటాయిస్తారు. వీటిలో 70 శాతం పంచాయతీలకు, 15 శాతం చొప్పున మండల, జిల్లా పరిషత్‌లకు ఏటా నిర్ణీత మొత్తంలో విడుదల చేస్తారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్‌లు ఉండగా.. ఇప్పటికే 12,686 గ్రామ పంచాయతీలు, 593 మండల పరిషత్‌లు, 12 జిల్లా పరిషత్‌లలో పీడీ ఖాతాలు తెరిచే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ పూర్తిచేసింది. -
‘ప్రియా’.. లెక్కలు చెప్పాలా..!
- ‘ఆన్లైన్’లోనే పంచాయతీల జమా ఖర్చులు - ‘సాఫ్ట్వేర్’లో పూర్తిచేస్తేనే నిధులు - రేయింబవళ్లు కుస్తీపడుతున్న ఆపరేటర్లు - లెక్కలు సరిచూసుకుంటున్న అధికారులు బాన్సువాడ : గ్రామ పంచాయతీలు ఇక గాడిలో పడాల్సిందే. తమకు వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. అయితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు ఆన్‌లైన్‌తో కుస్తీ పడుతున్నాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కేంద్రం 2011-12 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జమాఖర్చుల వివరాలను ఇందులో పొందుపర్చాలని ఆదేశించింది. తలకు మించిన భారం దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోనూ ప్రియా సాఫ్ట్వేర్ ద్వారా గ్రామ పంచాయతీల జమా ఖర్చుల వివరాలు నమోదు చేయడం మూడేళ్ల కిందటే ప్రారంభమైంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ గ్రామ పంచాయతీ సిబ్బందికి రోజువారీ విధు ల్లో ఒకటిగా మారింది. కానీ మనరాష్ట్రంలో గ్రామపంచాయతీలు పూర్తిస్థాయిలో జమాఖర్చుల వివరాలను పొందుపర్చలేదు. దీంతో ఇప్పుడు ఒకేసారి నాలుగేళ్లకు సంబంధించిన జమాఖర్చుల వివరాలను నమోదు చేయడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. గత మూడేళ్లుగా గ్రామ పంచాయతీలకు సం బంధించి పాలకవర్గాలు లేకపోవడం, పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడం వల్లే నేడు ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పూర్తిస్థాయి వివరాల ను నమోదు చేయడంలో మిగితా రాష్ట్రాల కంటే వెనుకబడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేనందున కేంద్రం ప్రత్యేక నిధులు, గ్రాంట్లను విడుదల చేయలేదు. పంచాయతీలపై కనీస పర్యవేక్షణ లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పాలన గాడితప్పడం, జమాఖర్చులకు సంబంధించి సరైన వివరాలను నమోదు చేకపోవడం వల్ల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ‘ప్రియా’తోనే నిధులు కేంద్రం విడుదల చేసే నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు పూర్తిగా ‘ప్రియా’ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. గ్రామ పంచాయతీల్లో ఆపరేటర్లు రేయింబవళ్లు జమాఖర్చులతో కుస్తీపడుతున్నారు. సరైన అకౌంట్లు లేనందున నిధుల ఖర్చు వివరాలను నమోదు చేయడం ఇబ్బందిగా మారింది. పంచాయతీల్లో నిధుల గోల్మాల్ జరగడం, ఖర్చులకు సంబంధించిన వివరాలు లేకపోవడం వల్ల ప్రియా సాఫ్ట్‌వేర్‌లో బయటపడుతుంది. లెక్కలను సరిచేసుకునేందుకు పంచాయతీ అధికారులు తలమునకలవుతున్నారు. జిల్లాలోని 718 పంచాయతీలకు సంబంధించిన వివరాలు ఆయా మండల పరి షత్ కార్యాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇందులో నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్స్ నిధులు, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్స్, ఎంపీ నిధులు, ఆ ర్‌డబ్ల్యూఎస్, వృద్ధాప్య ఫించన్ల నిధులు, పైకా, సర్వశిక్షా అభియాన్, స్టేట్ ఫైనాన్స్ నిధులు, పారిశుధ్య తదితర నిధులు విడుదలవుతాయి. ఈ నిధులను ఎలా ఖర్చు చేశారో.. దానికి సంబంధించిన రసీదుల వివరాలను ప్రియాలో నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగానే తదుపరి నిధులను విడుదల చేస్తారు. నిధుల గోల్‌మాల్‌కు చెక్ గ్రామ పంచాయతీల్లో తప్పుడు బిల్లులు పెట్టి రూ.వేలు, లక్షల్లో డబ్బులను డ్రా చేసే విధానానికి ఆన్లైన్ వల్ల చెక్ పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతీ పైసాకు ఈ సాఫ్ట్‌వేర్‌లో లెక్క చెప్పాల్సి ఉంటుంది. అలా నమోదు చేస్తేనే తదుపరి నిధులు మంజూరవుతాయి. స్థానికంగా ఇళ్ల పన్నులు, ఇతరత్రా ఆదాయాల వివరాలను సైతం ఇందులో పొందుపర్చాలి. చిన్న చిన్న ఖర్చులు తప్పా, పూర్తిస్థాయి వివరాలు ఇందులో ఉంచాలి. సామాన్యులు సైతం ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీల జమా, ఖర్చుల వివరాలను చూసే సౌలభ్యం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ పేరుతోనే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినా మూడేళ్ల క్రితం రూపొందించిన ప్రియా సాఫ్ట్‌వేర్‌లో ఆంధ్రప్రదేశ్ పేరిటనే అకౌంటింగ్ సిస్టం కొనసాగుతోంది. సంబంధిత అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంది.