‘లెక్క’ తేలుస్తారు!  | Accounting teams for election expenditure monitoring | Sakshi
Sakshi News home page

‘లెక్క’ తేలుస్తారు! 

Published Sun, Oct 8 2023 4:43 AM | Last Updated on Sun, Oct 8 2023 4:43 AM

Accounting teams for election expenditure monitoring - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌ అకౌంటింగ్‌ టీమ్స్‌ను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం, ర్యాలీలు, బహిరంగ సభలు తదితర కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న సొమ్మును ఆడిట్‌ చేస్తారు. ఎన్నికల సామాగ్రికి ఎంత ఖర్చు చేసిందీ తెలుసుకుంటారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...ముïÙరాబాద్‌ నియోజకవర్గానికి చార్మినార్‌ జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌  సూపరింటెండెంట్‌ మీర్జా రాజా అలీ, జీపీఎఫ్‌ సెక్షన్‌కు చెందిన అజయ్‌కుమార్‌లను అకౌంటింగ్‌ ఆఫీసర్లుగా నియమించారు. మలక్‌పేటకు కూకట్‌పల్లి జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రామ్మోహన్, ఖైరతాబాద్‌ జోన్‌ జూనియర్‌ ఆడిటర్‌ అనిల్‌కుమార్‌ను నియమించారు.

అంబర్‌పేటకు కూకట్‌పల్లి జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ గౌడ్, సీనియర్‌ ఆడిటర్‌ కె.నరేందర్‌లను, ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి కూకట్‌ పల్లి జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజు, ఖైరతాబాద్‌ జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ బాబును నియమించారు. అలాగే జూబ్లీహిల్స్‌కు ఖైరతాబాద్‌ జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రమేష్, సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ కుమార స్వామి, సనత్‌నగర్‌ నియోజకవర్గానికి సికింద్రాబాద్‌ జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పద్మజ రాణి, జూనియర్‌ ఆడిటర్‌ భరత్, నాంపల్లికి శేరిలింగంపల్లి జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ లెనిన్‌ బాబు, ఖైరతాబాద్‌ జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఫర్జానా బేగం, కార్వాన్‌కు ఖైరతాబాద్‌ జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీలత, కూకట్‌పల్లి జోన్‌ ఆడిట్‌ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ భారతి, గోషామహల్‌ నియోజకవర్గానికి పీడీఎస్‌జడ్‌ –2 సూపరింటెండెంట్‌ ముబీన్‌ ఫాతి మా, జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేష్లను నియమించారు.

అలాగే చారి్మనార్‌ నియోజకవర్గానికి సికింద్రాబాద్‌ జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సయ్యద్‌ జియా ఉల్లా  హుస్సేన్, చార్మినార్‌ సర్కిల్‌ హెల్త్‌ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.డి ఖాదిర్‌ అలీ చాంద్రాయణగుట్టకు చార్మినార్‌ జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ముబాస్సిర్‌ హుస్సేన్‌ ఖాన్, జూనియర్‌ అసిస్టెంట్‌ సాగర్‌ సక్సేనా, యాకుత్‌పురా నియోజకవర్గానికి సికింద్రాబాద్‌ జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ యాదవ్, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్, బహదూర్‌పురా నియోజకవర్గానికి ఎల్‌బీనగర్‌ జోన్‌ ఎఫ్‌ఏ  సెక్షన్‌ సూపరింటెండెంట్‌ చంద్రమోహన్, జూనియర్‌ అసిస్టెంట్‌ బావ్మాతి, సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి ఎల్‌బీనగర్‌ జోన్‌ ఎఫ్‌ఏ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సంజన, జూనియర్‌ అసిస్టెంట్‌ స్రవంతి, కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి సికింద్రాబాద్‌ ఆడిట్‌ సెక్షన్‌ సీడీఓ  పరమేశ్వరి, ఎఫ్‌ఏ  సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్లను నియమించారు. వీరితోపాటు మరికొందరిని రిజర్వుగా ఉంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement