చాచా సింపుల్ స్టెప్పులతో ఇరగదీశాడు.. | Elderly Man Dance On Ghar Aaya Mera Pardesi Song | Sakshi
Sakshi News home page

చాచా సింపుల్ స్టెప్పులతో ఇరగదీశాడు..

Published Sat, Dec 14 2019 4:59 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

డాన్స్‌కు వయసుతో సంబంధంలేదని నిరూపించాడు ఓ తాత. ముసలితనంలో కూడా హుషారెత్తించే స్టెప్పులేసి అదరహో అనిపించాడు. 1951లో రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆవారా చిత్రంలోని ‘ఘర్‌ ఆయా మేరా పర్‌దేసి..’  పాటకు  తనదైన శైలిలో డాన్స్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పుల్‌ జోష్‌తో సింపుల్‌ స్టెప్పులేస్తూ వావ్‌.. అనిపించాడు. తాత డాన్స్‌ వీడియోను హర్షా గోయెంకా అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ వయసు పెరిగిందని డాన్స్‌ చేయడం మానేయకండి. డాన్స్‌ మానేస్తే మీరు ముసలివాళ్లు అయిపోతారు. చాచా జాన్‌ను చూడండి’   అంటూ గోయెంకా ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement