అన్నానగర్: చైన్నెలోని కొలత్తూరు తిరుపతి నగర్‌కు చెందిన తిరువెంకటం (65) బైకుపై స్థానికంగా ఉండే ఓ దుకాణానికి వెళ్లేందుకు శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే ఆ తర్వాత ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోయి, ఇంటికి వెళ్లే మార్గం తెలియక రోజంతా బైకుపై కొలత్తూర్, అన్ననగర్, అమంజకరై, అరుంబాక్కంలలో చక్కర్లు కొట్టాడు.
చివరికి అరుంబాక్కంలోని 100 అడుగుల రోడ్డులో అర్ధరాత్రి 1.30 గంటలకు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ వాహనాల తనిఖీల్లో భాగంగా వృద్ధుడిని ఆపి విచారణ చేపట్టాడు. ఈ సమయంలో తన ఇంటికి వెళ్లే దారి తెలియక రాత్రంతా రోడ్లపై తిరుగుతున్నట్లు వెల్లడించారు. దీంతో వృద్ధుడి ఇంటి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్‌ను గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను సమాచారం అందించి ఇంటికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment