![Family Members Leave Old Man in Forest YSR Kadapa - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/14/old-man.jpg.webp?itok=P9xgDcWY)
వైఎస్‌ఆర్ జిల్లా, సింహాద్రిపురం : ఓ వృద్ధుడిని ఎవరో సింహాద్రిపురం మండలంలోని భానుకోట సోమేశ్వరస్వామి క్షేత్రంలో వదిలి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఓ చెట్టు కింద ఆపారు. కొద్దిసేపు అక్కడే ఉండి ఎవరూ చూడని సమయంలో వృద్ధుడిని వదిలి వెళ్లిపోయారు. సాయంత్రం ఆలయ పూజారి అటు వైపు వస్తుండగా వృద్ధుడిని గమనించారు. ఆయన సోమవారం విలేకరులకు తెలిపారు. వృద్ధుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మాట్లాడే స్థితిలో లేడు. వయసు 65 నుంచి 70 ఏళ్ల వరకు ఉంటుంది. ఆయనను కుటుంబ సభ్యులో.. లేక మరెవరో ఇక్కడి వదిలిపెట్టి చేతులు దులుపుకొన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment