
బకెట్‌లో ఉన్న మృతుడి తలను పరిశీలిస్తున్న పోలీసులు
వైఎస్‌ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల: స్థానిక ముద్దనూరు రోడ్డులోని మహాత్మానగర్ నగర కాలనీలో నివాసం ఉండే ఐసీఎల్ రిటైర్డు ఉద్యోగి బొలిశెట్టి వెంకటరమణ (60)ను దారుణ హత్య చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ములసయ్య ఇంటిలో మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతంలో సంచలనం కలిగిచింది. మాజీ మంత్రి అదినారాయణరెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య, హతుడు వెంకటరమణమయ్య మధ్య సన్నిహిత సంబంధలు ఉండేవి. వీరివురి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన రాత్రి నుంచి కనిపించకుండా పోయిన వెంకటరమణయ్యను ఏవరో కిడ్నాపు చేశారని పట్టణంలో ప్రచారం సాగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వెంకటరమణమయ్య సోదరుడు రామయ్య ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ సదాశివయ్య వెంకటరమణతో సన్నిత, ఆర్థిక సంబంధాలు ఉన్న వారందరినీ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ములసయ్యను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా నేరం అంగికరీంచినట్లు తెలిసింది.
హత్యకు గురైన బొలిశెట్టి వెంకట రమణయ్య(ఫైల్ ) ,హత్య కేసులో ప్రధాన నిందితుడు ముసలయ్య
తల, మొండెం వేరుచేసి పడేశారు: వెంకటరమణయ్యను హత్య చేసి తన ఇంటి ఆవరణలో బూతురూం పక్కనే పూడ్చి పెట్టినట్లు ముసలయ్య అంగీకరించారు. తలను వేరు చేసి రాయచోటి ప్రాంతంలోని గువ్వల చెరువు ఘాట్‌లో పడేశారు. కడప డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య పోలీస్ సిబ్బందితో ముసలయ్య ఇంటికి వెళ్లి పూడ్చి పెట్టిన వెంకటరమణయ్య మృత దేహాన్ని వెలికి తీశారు.
ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం: మృతుడు వెంకటరమణకు భార్య శామలదేవి, కూమరుడు రాకేష్, కుమార్తె సృతి ఉన్నారు. వెంకటరమణయ్యకు మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య అసలు వడ్డీతో కలసి సుమారు రూ.30 లక్షలు దాకా బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. బాకీ డబ్బులు ఇవ్వాలని తరుచు అడుగుతూ ఉండేవాడు. డబ్బులు ఇస్తామని నమ్మించి వెంకటరమణయ్యను ముసలయ్య ఇంటికి పిలిపించుకుని మద్యం తాపించి పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. తలను మొండెం వేరు చేసి, మొండంను ఇంటిలోని బాతురూం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పూడ్చివేశారు. తలను మాత్రం గుర్తు పట్టకుండా ఉండేందుకు స్టీల్ బకెట్‌లో తీసుకెళ్లి గువ్వల చెరువు ఘాట్‌లో పడేశారు. హత్య కేసులో ముసలయ్యతో పాటు మరి కొంత మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రగుంట్లలో హత్యకు గురైన వ్యక్తి తల లభ్యం
చింతకొమ్మదిన్నె : ఎర్రగుంట్లలో రిటైర్డ్ ఉద్యోగి వెంకట రమణయ్యను హత్య చేసి తలను వేరుచేసి గువ్వల చెరువు ఘాట్‌లో పడేశారు. మొండెం మాత్రం ఎర్రగుంట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య ఇంటి ఆవరణలో లభించింది. డీఎస్పీ సూర్యనారాయణ లోతుగా దర్యాప్తు చేయడంతో హత్య విషయం వెలుగు చూసింది. గువ్వల చెరువు ఘాట్‌లో పడేసిన తలను సీఐ ఉలసయ్య, ఎస్‌ఐలు వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment