
రాంచీ: దేశంలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వాటి ఫలితం మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకుంటే నిత్యం ఏదో ఓ చోట మహిళలు, బాలికలు కామాంధుల చేతుల్లో బలవుతునే ఉన్నారు. తాజాగా మనవరాలి వయసున్న ఓ మైనర్‌పై కన్నేసి రెండేళ్లుగా లైంగికదాడి పాల్పడుతూ ఉన్నాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని సిమ్‌దేగా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 58 ఏళ్ల వృద్ధుడు తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికపై కన్నేశాడు. బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం కేరళలో ఉండగా, తల్లి కూలి పనులకు వెళ్లేది. వీటని అవకాశంగా మార్చుకున్న అతను.. ఇంట్లో బాలిక తల్లి లేనప్పుడు ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి రెండేళ్లుగా బాలికపై అఘాయిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించే వాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.
చదవండి: గర్భిణితో సహా ఆమె భర్తని కిరాతకంగా హత్య చేసిన బంధువులు
Comments
Please login to add a commentAdd a comment