ప్రతీకాత్మక చిత్రం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది.
గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి.
చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment