వ్యాయామాలు చేస్తున్నప్పుడో, పొరబాటున కింద పడినప్పుడో, బరువులు ఎత్తినప్పుడు హఠాత్తుగా కీళ్లు పట్టేయడం, కాళ్లు చేతులు బెణకడం వంటి అనుభవాలు అందరికీ ఎదురయ్యేవే! గాయాల వల్లనో, ఇతర కారణాల వల్లనో కీళ్లనొప్పులు తలెత్తితే తోచిన నొప్పినివారణ మాత్రలు వేసుకోవడం, పైపూతలుగా ఏవో ఆయింట్‌మెంట్లు పూసుకోవడం, కాపడాలు పెట్టుకోవడం వంటి చికిత్సలు చేసుకుంటాం.
కీళ్లనొప్పులు నయం కావడానికి ఇక ఇన్ని ఇబ్బందులు పడనక్కర్లేదు. ఫొటోలో కనిపిస్తున్న బెల్టును నొప్పి ఉన్నచోట బిగించుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ పరికరాల తయారీ సంస్థ ‘రివీవ్’ ఈ బెల్టును ‘నీ ప్లస్’ పేరుతో రూపొందించింది. ఇందులోని ఎల్‌ఈడీ, లేజర్ లైట్ల కాంతి నొప్పి ఉన్నచోటకు ప్రసరించి, దెబ్బతిన్న కణజాలానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా కొద్ది సమయంలోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని ధర 499 డాలర్లు (రూ.41,102) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment