
కూతురులాంటి కోడలికి అమ్మలాంటి అత్త!!
‘అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’ అంటూ సృష్టికి శ్రీకారం చుట్టింది అమ్మేనంటారు. మరి అలాంటి అమ్మకు వందనాలు చెప్పడానికి ఓ రోజు... అదే ఈ మాతృదినోత్సవం. మనం భూమ్మీదకొచ్చిన తర్వాత తొలి ఆత్మీయ స్పర్శ అమ్మదే. తొలి ప్రేమలాలన అమ్మదే. స్వచ్ఛమైన ప్రేమకి ప్రతీక అమ్మ. మనం తొలిసారి తీసుకునే ఆహారం అమ్మ ప్రసాదించినదే.
అమ్మ ప్రేమలోని మాధుర్యం తెలుసుకోవడం ప్రతి అమ్మాయి బాధ్యత. అయితే అది ఆమె అమ్మయ్యాకే పరిపూర్ణంగా తెలుస్తుంది. ఓ అమ్మకి కూతురిగా ఉంటూనే అమ్మగా మాతృత్వపు మాధుర్యాన్ని పొందడానికి దేవుడు నాకు ఓ వరమిచ్చాడు. ఆ వరమే మా పాప. మరి... నాకు కూడా కూతురులాంటి ఓ కోడలు వస్తోంది. ఆ కోడలు మామూలు కోడలు కాదు, బంగారంలాంటి కోడలు. నాకు కూతురు లాంటి బంగారు కోడలు సుహాసినితో కలిసి ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం జీ తెలుగులో ‘నా కోడలు బంగారం’ మెగా సీరియల్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఆశీర్వదిస్తారు కదూ!