'మదర్స్‌ డే' రోజు ఓ తల్లి అడిగిన వినూత్న కానుకలు | On The Occasion Of Mothers Day, A Mom Asked For Different Gifts | Sakshi
Sakshi News home page

'మదర్స్‌ డే' రోజు ఓ తల్లి అడిగిన వినూత్న బహుమతులు

May 14 2023 7:59 AM | Updated on May 14 2023 7:59 AM

On The Occasion Of Mothers Day, A Mom Asked For Different Gifts - Sakshi

మదర్స్‌ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్‌లు ఇవ్వడానికి పిల్లలు రకరకాలుగా ప్లాన్‌లు చేస్తుంటారు. అయితే ఈ పంజాబీ మహిళ మాత్రం ‘మీరు ఇచ్చే గిఫ్ట్‌లు నాకు వద్దుగాక వద్దు’ అంటోంది. ‘అదేమిటి!’ అని ఆశ్చర్యపోయేలోపే ‘నేను అడిగిన గిఫ్ట్‌లు మాత్రం ఇవ్వాలి’ అన్నది. ఆమె అడిగిన గిఫ్ట్‌లు...

  • సెల్‌ఫోన్‌తో గంటలు గంటలు గడపవద్దు
  • అదే లోకంగా బతకవద్దు 
  • పొద్దుపోయాక బద్దకంగా నిద్ర లేవడం కాదు, ఉదయాన్నే హుషారుగా లేవాలి 
  • ఆన్‌లైన్‌ ఫుడ్‌ పార్శిల్స్‌ వద్దు
  • ఇంటి తిండే ముద్దు

‘ఇవి డిమాండ్సా? గిఫ్ట్‌లా?’ అని ఒక యూజర్‌ సందేహం రైజ్‌ చేస్తే, మరో యూజర్‌ ఇలా స్పందించాడు... ‘డిమాండ్స్‌కు పిల్లలు ఓకే అంటే అవే గిఫ్ట్‌లుగా మారిపోతాయి. పిల్లల మంచి భవిష్యత్‌కు మించి తల్లికి కావల్సిన గొప్ప గిప్ట్‌ ఏదీ లేదు!’  సోనియా కత్రి అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement